ఏ పార్టీలోనూ చేరడం లేదు : ప్రకాశ్‌ రాజ్‌

ఏ పార్టీలోనూ చేరడం లేదు : ప్రకాశ్‌ రాజ్‌

13-11-2017

ఏ పార్టీలోనూ చేరడం లేదు :  ప్రకాశ్‌ రాజ్‌

తానే పార్టీలోనూ చేరడం లేదని నటుడు ప్రకాశ్‌ రాజ్‌ సృష్టం చేశారు. ఇటీవలి కాలంలో ప్రధాని మోదీపై విమర్శలతో సంచలనం సృష్టించిన ప్రకాశ్‌ రాజ్‌ త్వరలో ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరబోతున్నారంటూ వార్తలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. తానే కాదు నటులెవరూ రాజకీయ పార్టీలలో చేరకూడదన్నది తన అభిప్రాయమన్నారు. నటుడిగా తన బాధ్యత నటించడమేనని పేర్కొన్న ఆయన నటులకు అభిమానులు ఉంటారని, వారిని అలరించడం నటుల బాధ్యత అని ప్రకాశ్‌ రాజ్‌ పేర్కొన్నారు.