అమరావతిలో పద్మావతి

అమరావతిలో పద్మావతి

20-11-2017

అమరావతిలో పద్మావతి

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో బాలీవుడ్‌  పద్మావమి దీపికా పడుకోన్‌ సందడి చేసింది. అమరావతిలో పచ్చదనం, అభివృద్ధి చాలా బాగుందని కితాబిచ్చింది. ఏపీ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన సోషల్‌ మీడియా సమ్మిట్‌ అండ్‌ అవార్డ్స్‌ కార్యక్రమంలో దీపికా పడుకోన్‌ పాల్గొంది. ఈ సందర్భంగా మోస్ట్‌ యాక్టివ్‌ సెలబ్రిటీ ఆన్‌ సోషల్‌ మీడియా అవార్డును ఆమె అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అభిమానుల వల్లే తాను సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నానని అన్నారు. మోస్ట్‌ యాక్టివ్‌ ఆన్‌ సోషల్‌ మీడియా సౌత్‌ అవార్డును హీరో రానా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ పనిచేస్తూ ఎక్కువ యాక్టివ్‌గా ఉంటానని సరదాగా వ్యాఖ్యానించారు. మ్యూజిక్‌ సెన్షేషనల్‌ ఆన్‌ సోషల్‌ మీడియా అవార్డును ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ అందుకున్నారు. అనంతరం ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఏపీ యంగ్‌ స్టేట్‌ అని, తాను యంగ్‌ మినిస్టర్‌ అని వ్యాఖ్యానించారు.