జీఈఎస్‌కు దీపిక డుమ్మా

జీఈఎస్‌కు దీపిక డుమ్మా

21-11-2017

జీఈఎస్‌కు దీపిక డుమ్మా

పద్మావతి చిత్ర వివాదంలో చిక్కుకున్న ప్రముఖ నటి దీపికా పడుకోన్‌ హైదరాబాద్‌లో 28న ప్రారంభమయ్యే ప్రపంచ వాణిజ్య సదస్సు (జీఈఎస్‌)కు డుమ్మా కొట్టాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి ఆమె సమాచారం పంపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు. దేశవ్యాప్తంగా దుమారానికి కారణమైన పద్మావతి చిత్రంలో దీపికా టైటిల్‌ రోల్‌లో నటించింది. పద్మావతిపై వివాదం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో చిత్రం విడుదల వాయిదా పడింది. జీఈఎస్‌కు గైర్హాజరవ్వాలని దీపిక నిర్ణయించుకోవడానికి చిత్ర వివాదమే కారణమని తెలుస్తోంది.