పాదయాత్ర చేస్తున్న జగపతిబాబు

పాదయాత్ర చేస్తున్న జగపతిబాబు

21-11-2017

పాదయాత్ర చేస్తున్న జగపతిబాబు

ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు విశాఖపట్టణంలో పాదయాత్ర చేశారు. చిన్న చిత్రాలను ప్రోత్సహించాలని కోరుతూ ఆయన పాదయాత్ర చేశారు. ఆయన వెంట అభిమానులు పాదయాత్రలో పాల్గొన్నారు. కాళేశ్వరరావు మార్కెట్‌ సెంటర్‌ నుంచి భవన్నారాయణ వీధి రోడ్డు, శంకర్‌ కేఫ్‌ సెంటర్‌ మీదుగా సామారంగ చౌక్‌ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతో సెల్పీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. అనంతరం తన పాదయాత్రకు అసౌకర్యం కలిగించకుండా తగిన భద్రతా ఏర్పాట్లు ఏర్పాట్లు చేపట్టిన వెస్ట్‌ జోన్‌ ఏసీపీ జి.రామకృష్ణ కార్యాలయానికి వెళ్లి కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.