సూపర్‌స్టార్‌ సంచలన ప్రకటన
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

సూపర్‌స్టార్‌ సంచలన ప్రకటన

23-11-2017

సూపర్‌స్టార్‌ సంచలన ప్రకటన

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తన అభిమానులకు చేదువార్త అందించారు. తమ అభిమాన నటుడు రాజకీయాల్లోకి వస్తారని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు నిరాశ కలిగించే ప్రకనట చేశారు. తాను రాజకీయల్లోకి రావడం లేదని ప్రకటించారు. తన తాజా చిత్రం విడుదలైన తర్వాత మరోసారి అభిమానులతో సమావేశమవుతానని తెలిపారు. తాను ఏ రంగంలోకి దిగడం లేదని సృష్టం చేశారు. రజనీకాంత్‌ ప్రకటనతో ఆయన రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహగానాలకు తెర దించిట్లైంది. సినిమాల్లో అగ్రహీరోగా కొనసాగుతున్న రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తారని గత కొంతకాలంగా విస్తవృత ప్రచారం జరుగుతోంది. అభిమానులతో ఆయన వరుస సమావేశాలు నిర్వహించడం దీనికి బలం చేకూర్చింది. రజనీ రాజకీయాల్లోకి ఖాయమని ఆయన సోదరుడు, సన్నిహితులు వెల్లడించడంతో ప్రచారం మరింత ఊపందుకుది. అయితే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు రజనీకాంత్‌ ఎప్పుడూ సృష్టంగా చెప్పలేదు. దీంతో ఆయన రాజకీయ ప్రవేశంపై రకరకాల ఊహగానాలు వెల్లువెత్తాయి. వీటన్నింటికీ తాజా ప్రకటనతో రజనీ పుల్‌సాఫ్ట్‌ పెట్టారు.