తెలుగు ఫిల్మ్ చాంబ‌ర్ ఆవ‌ర‌ణ‌లో ఎమ్.పి. దిష్టిబొమ్మ‌ ద‌హ‌నం

తెలుగు ఫిల్మ్ చాంబ‌ర్ ఆవ‌ర‌ణ‌లో ఎమ్.పి. దిష్టిబొమ్మ‌ ద‌హ‌నం

23-11-2017

తెలుగు ఫిల్మ్ చాంబ‌ర్ ఆవ‌ర‌ణ‌లో ఎమ్.పి. దిష్టిబొమ్మ‌ ద‌హ‌నం

ఉజ్జేయిని నియోజిక‌ వ‌ర్గ‌ ఎమ్.పి. చింతామ‌ని మాల్వియ‌ మ‌హిళ‌ల‌ను ఉద్దేశించి సినిమా ఇండ‌స్ట్రీ పై చేసిన‌ అనుచిత‌ వాక్య‌ల‌ను కండిస్తూ నిర‌స‌న‌గా ఈరోజు తెలుగు ఫిల్మ్ చాంబ‌ర్ ఆవ‌ర‌ణ‌లో ఎమ్.పి. దిష్టి బొమ్మ‌ను ద‌హ‌నం చేస్తు నిర‌స‌న‌ తెల‌ప‌డం జ‌రిగింది...

తెలంగాణ‌ ఫిల్మ్ చాంబ‌ర్ ఛైర్మ‌న్ ప్ర‌తాని రామ‌క్రిష్ణ‌ గౌడ్ మాట్లాడుతూ...సినిమా ఇండ‌స్ట్రీలో ఉన్న‌ వాళ్ళ‌ బార్య‌లు రోజుకు ఒక‌ మ‌గ‌వారిని మారుస్తార‌ని అలాగే న‌టిమ‌నులు వేష్య‌లు గా ఉంటార‌ని అత‌ను చేసిన‌ వాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టి వెంట‌నే అత‌ను ఈ వాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకోవ‌లాని లేదంతే పెద్ద‌ ఎత్తున‌ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ అంత‌ ఒక‌టి చేస్తూ ఆయ‌న‌ రాజీనామ‌ కు కూడా డిమాండ్ చేస్తున్నాము ఎక్క‌డో ప‌ద్మావ‌తి సినిమా ప్రెస్ మీట్ లో చెప్పి అస‌లు ప‌ద్మావ‌తి సినిమా అనేది 1540 లో "న‌వ‌ల‌ " రూపంలో వ‌చ్చిన‌ దానిని సినిమాగా మ‌లిచారు అందులో క‌థ‌ ఎంటంటే ప‌ద్మావ‌తి అనే అమ్మాయి ఒక‌ అంద‌మైన‌ అమ్మాయి ఈ అమ్మాయి శ్రీలంక‌ లో పుట్టింది ప‌ద్మావ‌తి కి తోడుగా మాట్లాడే చిలుక‌ ఉండేది ఎక్కువ‌ స‌మ‌యాన్ని చిలుక‌తో గ‌డుపుతుంద‌ని అమ్మాయి తండ్రి చిల‌క‌ను చంప‌డానికి ప్ర‌య‌త్నిస్తాడు ఆ చిలుక‌ త‌ప్పించుకొని వెళ్ళి ఒక‌ బోయ‌వాడికి దొరుకుతుంది ఆ బోయ‌వాడు తీసుకొని ఒక‌ " సేన్ " అనే రాజుకు అమ్మేస్తాడు  ఈ రాజుకు ప‌ద్మావ‌తి అందాల‌ గురించి చెప్తుంది ఆ చిల‌క‌ ప‌ద్మావ‌తిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు సేన్ రాజు ఆ త‌ర్వాత‌ డిల్లీ రాజు " అల్లాఒద్దిన్ కుల్జీకి " ఆ అమ్మాయి పైన‌ మ‌న‌సు ప‌డుతుంది అప్పుడు ఆ అమ్మాయి భ‌ర్త‌ అత‌నితో యుద్దం చేసి ప‌ద్మావ‌తి భ‌ర్త‌, తండ్రి చ‌నిపోతారు వీరు చ‌నిపోయిన‌ వెంట‌నే ప‌ద్మావ‌తి అగ్నికి ఆహుతి అవుతుంది ఇది జ‌న‌రల్ క‌థ‌ దీనిని ప‌ట్టుకొని ఇండ‌స్ట్రీ వాళ్ళ‌ను అన‌డం త‌గ‌దు...

త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ్ మాట్లాడుతూ... బాద్య‌త‌ క‌లిగిన‌ ప్ర‌జా ప్ర‌తినిది గా ఉండి ఇలా సంస్కార‌ హీనంగా మాట్లాడ‌టం ఆయ‌న‌కు త‌గ‌దని అలాంటి వ్య‌క్తిని రాజ‌కీయ‌ నాయ‌కుడిగా కొన‌సాగిస్తే వ్య‌వ‌స్థ‌కు చేట‌ని వెంట‌నే అత‌నిని పార్టీ నుండి బ‌హిష్క‌రించాల‌ని డిమాండ్ చేసారు...

తెలంగాణ‌ ఫిల్మ్ చాంబ‌ర్ సెక్ర‌ట‌రీ సాయి వెంక‌ట్ మాట్లాడుతూ... ఎమ్.పి.చింతామ‌ని మావిల్య‌  మ‌హిళ‌ల‌ని కించ‌ప‌రిచినందుకు వెంటనే  సనీ  ఇండ‌స్ట్రీ మ‌హిళ‌ల‌కు క్ష‌మాప‌న‌ చేప్పాలి లేదంటే త‌గిన‌ చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించాడు...

టీ.మా.అధ్య‌క్షురాలు క‌విత మాట్లాడుటూ... ప్ర‌తి ఒక్క‌రికి అమ్మ‌,అక్క‌,చెల్లి,బార్య ఇలా అంద‌రు ఉంటార‌ని వారు కూడా మ‌హిళ‌లే అని మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచే విధంగా మాట్లాడటం స‌హించ‌రానిద‌ని మ‌హిళ‌లు అంత‌ ఒక్క‌టిగా ఇలాంటి వాఖ్య‌ల‌ని కండించాల‌ని ఆవేషంగా మాట్లాడారు...

టీ.మా.సెక్ర‌ట‌రీ గీతాంజ‌లి మాట్లాడుతూ ఆడ‌వాళ్ళ‌ని ఇలా అన‌డం త‌ప్పు దీనిని ఇండ‌స్టీలో ఉన్న‌ ప్ర‌తి ఒక్క‌రు కండిస్తున్నారు కాబ‌ట్టి ఆయ‌న‌ వెంట‌నే రాజినామ‌ చేయ‌ల‌ని కోరుచున్నాము...

ప‌రుచూరి గోపాల‌క్రిష్ణ‌ మాట్లాడుతూ...  సినిమా ఇండ‌స్ట్రీ లో యోదాను యోదులు ఉన్న‌రు ఇంత‌ మంది ఉన్న‌ ఈ సినిమా ఇండ‌స్ట్రీ పై మాట్లాడే ముందు కొంత‌ ఆలోచించి మాట్లాడాలి అని అన్నారు...

ఈ కార్య‌క్ర‌మంలో మోహ‌న్ గౌడ్, బాబ్జి, సీర‌జ్, ఠ‌‌గూర్ మ‌దు, మ‌రియు ఇత‌ర‌ సినీ ప్ర‌ముఖులు పాల్గొన్నారు...