పూజా కార్య‌క్ర‌మాలు జరుపుకున్న సుధీర్‌బాబు - ఇంద్ర‌గంటి - శ్రీదేవి మూవీస్ చిత్రం
Ramakrishna

పూజా కార్య‌క్ర‌మాలు జరుపుకున్న సుధీర్‌బాబు - ఇంద్ర‌గంటి - శ్రీదేవి మూవీస్ చిత్రం

23-11-2017

పూజా కార్య‌క్ర‌మాలు జరుపుకున్న సుధీర్‌బాబు - ఇంద్ర‌గంటి - శ్రీదేవి మూవీస్  చిత్రం

మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో నాని హీరోగా శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మించిన `జెంటిల్‌మేన్‌` ఎంత పెద్ద విజ‌యాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఇప్పుడు ఆ ద‌ర్శ‌క నిర్మాత‌లు మ‌రోసారి క‌లిసి సినిమా చేస్తున్నారు. సుధీర్‌బాబు హీరోగా న‌టిస్తున్న ఈ తాజా చిత్రం పూజా కార్య‌క్ర‌మాలు హైద‌రాబాద్‌లో గురువారం ఉద‌యం  జ‌రిగాయి. మ‌ణిర‌త్నం `చెలియా` సినిమాలో నాయిక‌గా న‌టించి అందరినీ ఆక‌ట్టుకున్న బాలీవుడ్ భామ అదితీరావు హైదరీ ఈ సినిమాలో నాయిక‌గా న‌టిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 10గా ఈ సినిమాను నిర్మిస్తోంది. 

నిర్మాత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ మాట్లాడుతూ ``గురువారం పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాం. ఇంద్ర‌గంటి మోహ‌న్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో మా సంస్థ‌లో మేం నిర్మించిన `జెంటిల్‌మేన్‌` ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. ఈ తాజా సినిమా స్క్రిప్ట్ కూడా చాలా బాగా వ‌చ్చింది. సుధీర్‌బాబుగారికి ప‌ర్ఫెక్ట్ సినిమా అవుతుంది.  డిసెంబ‌ర్ 11 నుంచి నిర‌వ‌ధికంగా షూటింగ్ చేస్తాం. మార్చితో చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది. మేలో సినిమా విడుద‌ల చేస్తాం.  హైద‌రాబాద్‌, హిమాచ‌ల్‌ప్ర‌సాద్‌, ముంబైలోని స‌రికొత్త లొకేష‌న్ల‌లో తెర‌కెక్కిస్తాం`` అని చెప్పారు. 

దర్శకుడు  మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ ``అనూహ్యమైన కథాంశంతో ఆద్యంతం వినోదాత్మకంగా నడిచే ఒక కొత్త తరం ప్రేమకథా చిత్రమిది`` అన్నారు.
సుధీర్‌బాబు, అదితిరావు హైద‌రి, న‌రేశ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, రోహిణి, నందు, కేదార్ శంక‌ర్‌, కాదంబ‌రి కిర‌ణ్‌, హ‌రితేజ‌, రాహుల్ రామ‌కృష్ణ‌, శిశిర్‌శ‌ర్మ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు మేక‌ప్‌:  పి.బాబు,  కాస్ట్యూమ్ డిజైన‌ర్‌:  ఎన్‌. మ‌నోజ్ కుమార్‌, ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్స్:  పి. ర‌షీద్ అహ్మ‌ద్ ఖాన్‌, కె. రామాంజ‌నేయులు,  ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: చ‌ంద్ర‌మోహ‌న్‌, కో డైర‌క్ట‌ర్‌:  కోట సురేశ్ కుమార్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: య‌స్ . ర‌వీంద‌ర్‌, ఎడిట‌ర్‌:  మార్తాండ్‌.కె.వెంక‌టేశ్‌;  డైర‌క్ట‌ర్ ఆఫ్ పొటోగ్ర‌ఫీ:  పి.జి.విందా,  సంగీతం:  వివేక్ సాగ‌ర్‌, నిర్మాత‌:  శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌,  ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం:  మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి.