ఆయన ప్రపోజ్‌ చేయకపోతే నేనే చేసేదాన్ని

ఆయన ప్రపోజ్‌ చేయకపోతే నేనే చేసేదాన్ని

06-12-2017

ఆయన ప్రపోజ్‌ చేయకపోతే నేనే చేసేదాన్ని

అందంగా, కాస్త బొద్దుగా ఉన్న నమిత నవంబర్‌ 24న తను కోరుకున్న ప్రియుడిని వేద మంత్రాల సాక్షిగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తిరుపతి ఇస్కాన్‌ టెంపుల్‌లో జరిగిన వీరి వివాహానికి కోలీవుడ్‌కి చెందిన పలువురు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. పెళ్లి తర్వాత మీడియాతో మాట్లాడిన వీర్‌, నమిత సినిమాలకి దూరం కాదని అన్నారు. ఇక నమిత తాజాగా ఓ ఆంగ్ల పత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో వీర్‌పై ప్రశంసలు కురిపించింది. తను ప్రపోజ్‌ చేసినప్పుడు రిజెక్ట్‌ చేసేందుకు ఏ కారణం దొరకలేదని, ఒకవేళ వీర్‌ ప్రపోజ్‌ చేయకపోయి ఉంటే నేను అతని ప్రపోజ్‌ చేసి ఉండేదానిని అని చెప్పుకొచ్చింది నమిత. గతంలో తనకు మూడు ఫెయిల్యార్స్‌ ఉన్నాయని అన్న నమిత, జీవితంలో సరైన వ్యక్తిని ఎంచుకోవడం ఎంత ముఖ్యమో ఫెయిల్యూర్స్‌ వలన తెలిసిందని పేర్కొంది. ఇక పెళ్లి తర్వాత తన జీవితంలో ఎలాంటి మార్పు రాలేదని చెపుకొచ్చిన బొద్దుగుమ్మ, మెడలో మంగళసూత్రం, కాలికి మొట్టెలు మాత్రమే పెళ్లి తర్వాత వచ్చాయని చెప్పింది.