'అజ్ఞాతవాసి' రెండో పాట డిసెంబర్‌ 12న విడుదల

'అజ్ఞాతవాసి' రెండో పాట డిసెంబర్‌ 12న విడుదల

07-12-2017

'అజ్ఞాతవాసి' రెండో పాట డిసెంబర్‌ 12న విడుదల

 

త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. ఈ చిత్రంలోని ‘బైయటికొచ్చి చూస్తే..’ పాట ఇటీవల విడుదలైంది. డిసెంబ‌ర్ 12న ఈ చిత్రంలోని రెండో పాటను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది. 'గాలి వాలుగ‌...' అంటూ సాగ‌నున్న ఈ పాట‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను వారు సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేశారు. పోస్టర్‌లో పవన్‌ స్టైల్‌గా నిలబడి పాట పాడుతున్నట్లుగా ఉన్న స్టిల్‌ఆకట్టుకుంటోంది. అనిరుధ్‌ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.

ఈ చిత్రంలో పవన్‌కి జోడీగా అను ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. 2018 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.