మెగా కుటుంబం నుంచి మరో కథానాయకుడు!
Sailaja Reddy Alluddu

మెగా కుటుంబం నుంచి మరో కథానాయకుడు!

08-12-2017

మెగా కుటుంబం నుంచి మరో కథానాయకుడు!

మెగాస్టార్‌ చిరంజీవి కుటుంబం నుంచి మరో కథానాయకుడు వెండితెరపై సందడి చేసేందుకు రంగం సిద్ధమైంది. చిరంజీవి అల్లుడు కల్యాణ్‌ హీరోగా త్వరలో ఓ సినిమా చేయనున్నారు. రాకేశ్‌ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. వారాహి చలన చిత్రం పతాకంపై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మించనున్నారు. రాశేశ్‌ చెప్పిన కథ నచ్చడంతో కల్యాణ్‌ ఈ చిత్రానికి పచ్చజెండా వూపారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.