'రంగస్థలం' ఫస్ట్‌లుక్‌ విడుదల
Sailaja Reddy Alluddu

'రంగస్థలం' ఫస్ట్‌లుక్‌ విడుదల

09-12-2017

'రంగస్థలం' ఫస్ట్‌లుక్‌ విడుదల

మెగా అభిమానులు ఎప్పటినుండో ఆతృతగా ఎదురుచూస్తున్న ''రంగస్థలం 1985'' ఫస్ట్ లుక్ ఎట్టకేలకు రానే వచ్చింది. డిసెంబర్ 9న ఉదయం 9 గంటలకు అని చెప్పినట్టు చెప్పిన ముహూర్తానికే రిలీజ్ చేశారు. మాస్‌ ప్రేక్షకులు మెచ్చేలా గల్ల లుంగీ, ఎర్ర బనియన్‌, మెడలో తుండుతో చిందేస్తూ కన్పించిన రామ్‌చరణ్‌ లుక్‌ అదిరిపోయింది. సినిమా టైటిల్‌ కూడా అలనాటి క్లాసిక్‌ మూవీ టైటిల్‌ గుర్తుచేస్తూ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 30, 2018న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.  సుకుమార్‌ దర్శకుడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌, మోహన్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు.