టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా 'మా' కర్టన్ రైజర్ ఫంక్షన్!

టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా 'మా' కర్టన్ రైజర్ ఫంక్షన్!

11-12-2017

టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో  ఘనంగా 'మా' కర్టన్ రైజర్ ఫంక్షన్!

'మా'  మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ 25 వ‌సంతాలు పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా  శివాజీ రాజా అధ్య‌క్ష‌త‌న ఏర్పాటైనా 'మా' నూత‌న కార్య వ‌ర్గం సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌లు ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిలో భాగంగా ఆదివారం హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్ హోట‌ల్ లో క‌ర్టైన్ రైజ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌  సూప‌ర్ స్టార్ కృష్ణ , విజ‌య నిర్మల దంప‌తులు, కృష్ణం రాజు చేతుల మీదుగా ఘ‌నంగా జ‌రిగింది. ముందుగా సీనియ‌ర్ న‌టీమ‌ణులు జ‌మున‌, శార‌ద‌, జ‌ప‌ప్ర‌ద‌, జ‌య‌సుధ చేతుల మీదుగా జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న జ‌రిగింది. సంగీత దర్శ‌కుడు కోటీ అండ్ టీమ్ మ్యూజిక‌ల్ నైట్... తార‌ల ఫ్యాష‌న్ షో తో వేడుక‌కు నూత‌న  శోభ తీసుకొచ్చారు. ఇదే వేదిక‌పై సీనియ‌ర్ న‌టీమ‌ణులు రోజా ర‌మ‌ణి, జ‌య‌సుధ‌, ప్ర‌భ‌ల‌కు మంత్రి త‌ల‌సాని, శార‌ద‌, జ‌య‌ప్ర‌ద  చేతుల మీదుగా ఘ‌నంగా స‌న్మానం జ‌రిగింది. అలాగే  తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్, తెలంగాణ ఎఫ్ డి.సీ చైర్మ‌న్ రామ్మోహ‌న‌రావు, ఏపీ ఎఫ్ .డి.సీ చైర్మ‌న్ అంబికా కృష్ణ‌ల‌ను `మా` ఘ‌నంగా  స‌న్మానించింది. 

అనంత‌రం సూప‌ర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ, ``మా` 25 సంవ‌త్స‌రాలు పూర్తిచేసుకోవ‌డం  చాలా సంతోషంగా ఉంది. మా ఏర్పాటైన నాటి నుంచి సొంత భ‌వనం ఏర్పాటు చేసుకోవాల‌నుకుంటున్నాం... కానీ వీలుప‌డ‌లేదు. ఇప్పుడు కొత్త‌గా ఏర్పాటైన క‌మిటీ సొంత భ‌వ‌నం ఏర్పాటుకు పూనుకోవ‌డం గొప్ప విష‌యం. అలాగే వ‌య‌సు మ‌ళ్లిన  పేద క‌ళాకారుల‌కు ఆస‌ర‌గా నిలిచే ఓల్డేజ్ హోర్ ఏర్పాటు చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. అందుకు నూత‌న కార్య‌వర్గానికి నా అభినంద‌న‌లు` అని అన్నారు.

విజ‌య నిర్మాల మాట్లాడుతూ, ` ఎప్ప‌టిక‌ప్పుడు నా వంతు స‌హాయం `మా`కు ప్ర‌తీ ఏడాది అందుతూనే ఉంది. ఒక‌సారి 5ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను విరాళంగా అందించాను. నా ప్రతీ పుట్టిన రోజుకు నా వ‌య‌సు ఎంత అయితే అంత మొత్తం `మా` కు అందించ‌డంలో నాకు చాలా తృప్తినిస్తుంది` అని అన్నారు.

కృష్ణంరాజు మాట్లాడుతూ, ` ఈరోజు `మా` కుటుంబ స‌భ్యుల‌ను క‌ల‌వ‌డం చాలా సంతో షంగా ఉంది.  `మా` సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌లే కాదు..గోల్డెన్ జూబ్లీ..డైమండ్ జూబ్లీ వేడుక‌లు కూడా చేసుకోవాలి. శివాజీ రాజా అధ్య‌క్ష‌త‌న ఏర్పాటైన క‌మిటి చురుకుగా ప‌నులు చేస్తోంది. వాళ్లు ఇలాగే మ‌రిన్ని మంచి కార్య‌క్ర‌మాలు చేయాలి` అని అన్నారు.

ముర‌ళీ మోహ‌న్ మాట్లాడుతూ, ` 25 ఏళ్ల క్రితం ఏర్ప‌డిన `మా` ఈరోజు ర‌జ‌తోత్స‌వాలు చేసుకోవ‌డం చాలా అనందంగా ఉంది. కొడుకు పుట్టగానే సంబరం కాదు..ఆ కొడుకు పెరిగి పెద్ద‌వాడై...ప్ర‌యోజ‌కుడు అయినప్పుడు క‌లిగే సంతోంషం వేరు. ఈరోజు `మా` అదే స్థానంలో ఉంది. అందుకు నేను గ‌ర్వంగా ఫీల్ అవుతున్నా. శివాజీ రాజా, న‌రేష్ ఇప్ప‌టికే మంచి కార్య‌క్ర‌మాలు చేశారు. ఇలాగే మ‌రిన్ని కార్య‌క్ర‌మాలు చేసి `మా` ను ముందుకు తీసుకెళ్లాలి` అని అన్నారు.

క‌ళాబంధు సుబ్బ‌రామి రెడ్డి మాట్లాడుతూ, ` శివాజీ అండ్ టీమ్ మంచి సేవా కార్య‌క్ర‌మాలు చేస్తోంది. అందుకు వాళ్ల‌ను అభినందిస్తున్నా. క‌ళాకారుల ఎన‌ర్జీ ఏంటో ఈరోజు మ‌రోసారి తెలిసింది` అని అన్నారు.

తెలంగాణ రాష్ర్ట సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ మాట్లాడుతూ, `1993లో స్థాపించిన `మా` దిన దిన అభివృద్ధి చెంది ఈరోజు మంచి స్థానంలో ఉంది. క‌ళామాత‌ల్లికి కుల‌మ‌త ప్రాంతీయ బేధాలుండ‌వు. ఇక్క‌డ అంతా ఒక్క‌టేన‌ని నిరూపించారు. `మా` మంచి కార్య‌క్ర‌మాల‌తో ముందుకు వెళ్తోంది. వాళ్ల‌కు తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం కూడా స‌హ‌కారం అందిస్తుంది. `మా` సోంత భ‌వ‌నం... గో ల్డేజ్ హో మ్ నిర్మాణానికి కావాల్సిన స్థ‌లాన్ని ప్ర‌భుత్వం నుంచి ఇప్పిస్తాం. ఇవి రాజ‌కీయ మాట‌లు కాదు.. చెప్పింది చెప్పిన‌ట్లు చేసి చూపిస్తా. అలాగే పేద క‌ళాకారుల‌కు మేజ‌ర్ ట్రీట్ మెంట్ కు కావాల్సిన భారీ మొత్తాన్ని కూడా సిఏం రిలీఫ్ ఫండ్ నుంచి వ‌చ్చేలా చూస్తా. ఏదైనా స‌హాయం కావాలంటే న‌న్ను వెంట‌నే సంప్ర‌దించచ్చు. అలాగే చిత్ర‌పురి కాల‌నీలో ఇప్పటికే కొంత మంది సొంతిళ్ల‌ను కల్గి ఉన్నారు. ఇంకొంత మందికి రావాల్సింది ఉంది. వాళ్ల‌కు వ‌చ్చే విధంగా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. వాళ్ల‌తో పాటు సినిమా జ‌ర్న‌లిస్టుల‌ను కూడా క‌లుపుకుని మందుకు వెళ్తే మంచిద‌ని భావిస్తున్నా.  అలాగే సినిమా షూటింగ్ ల‌కు సంబం ధించి ఇప్ప‌టికే అనుమ‌త‌లు సుల‌భం గా వ‌చ్చేలా జీవో జారీ చేసాం.  ప్ర‌భుత్వ‌మే ఆన్ లైన్ టిక్కెటింగ్ అందుబాటులోకి తీసుకొ స్తున్నాం..అన్నారు... శివాజీ రాజా, న‌రేష్ ల‌ను ఉప‌యోగించుకుంటే అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డ‌తారు..విస్మ‌రిస్తే... ఎలాంటి ప‌నులు జ‌ర‌గ‌వ‌వు. ఇప్ప‌టికే వీళ్లిద్ద‌రు `మా` కు ఎన్నో మం చి కార్య‌క్ర‌మాలు చేశారు. మ‌రింత మంచి ప్లానింగ్ లో ముందుకు వెళ్తున్నారు. ఈ ఫంక్ష‌న్ లో నేను కూడా భాగ‌మ‌వ్వ‌డం సంతోషంగా ఉంది` అని అన్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎఫ్.డి.సి చైర్మ‌న్ అంబికా కృష్ణ మాట్లాడుతూ, ` శివాజీ, న‌రేష్ క‌ష్ట‌మైనా ఎంతో ఇష్టం గా ప‌నిచేస్తున్నారు. ఇలాగే వాళ్లిద్ద‌రూ మ‌రిన్ని మంచి ప‌నుల‌తో దూసుకుపోవాలి. ఇక్క‌డ ఉన్న సినిమా వాళ్లంతా ఎక్కువ మంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ వాళ్లే. వాళ్లంతా ఏపీలో కూడా సినిమా షూటింగ్ లు చేయాల‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.

తెలంగాణ రాష్ర్ట ఎఫ్.డి.సి చైర్మ‌న్ రామ్మోహ‌న‌రావు మాట్లాడుతూ, `మా` సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌లే కాదు..గోల్డెన్..డైమండ్ జూబ్లీ వేడుక‌లు కూడా చేసుకోవాలి` అని అన్నారు.

జ‌య‌సుధ మాట్లాడుతూ, `ఇప్ప‌టివ‌ర‌కూ ఎన్నో అవార్డ‌లు అందుకున్నా. కానీ ఏ అవార్డు ఇవ్వ‌ని సంతృప్తిని `మా` స‌త్కారం నాకు అందించింది.  ఈ ఫంక్ష‌న్ ఇం త గ్రాండ్ గా చేస్తార‌ని ఊహిచంలేదు. ఇంత మంది సెల‌బ్రిటీల‌ను చూస్తుంటే చాలా గ‌ర్వంగా ఉంది. `మా` ఇలాగే మ‌రిన్ని మంచి కార్య‌క్ర‌మాలు చేయాలి` అని అన్నారు. 

ప్ర‌భ మాట్లాడుతూ, ` `మా` ఆధ్వ‌ర్యంలో నాకు స‌న్మానం జ‌ర‌గ‌డం చాలా గ‌ర్వంగా ఉంది. నా వంతు స‌హాయం మాకు ఎప్పుడూ అందుతూనే ఉంటుంది. `మా` ఎలాంటి మంచి కార్య‌క్ర‌మాలు చేస్తుందో నా క‌ళ్ల‌తో స్వ‌యంగా చూసా` అని అన్నారు.

రోజా ర‌మ‌ణి మాట్లాడుతూ, ` `మా` 25 లోకి రావ‌డం...నా సినిమా కెరీర్ 50 ఏళ్ల పూర్తిచేసుకోవడం ఒకేసారి రావ‌డం అందృ ష్టంగా భావిస్తున్నా. ఇది మ‌న అసోసియేష‌న్. క‌న్న త‌ల్లి త‌న బిడ్డ‌ను సత్కరించుకోవ‌డం అనేది ఎక్క‌డా లేదు. ఒక్క `మా`లోనే ఉంది. నాకు ఈరోజు ఇంత గౌర‌వాన్ని ఇచ్చినందుకు శివాజీ రాజా, న‌రేష్, శ్రీకాంత్ ల‌కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు` అని అన్నారు.

త‌మిళ‌నాడు న‌డిగ‌రం సంఘం అధ్య‌క్షుడు నాజ‌ర్ మాట్లాడుతూ, ` `మా` ను చూసి న‌డిగ‌ర్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ విష‌యాన్ని మా వైస్ ప్రెస్ డెంట్ కూడా చెప్పా.  `మా` చేస్తోన్న మంచి కార్య‌క్ర‌మాలు చాలా బాగున్నాయి.  `మా` వెంట న‌డిగ‌ర్ సంఘం ఎప్పుడూ ఉంటుంది` అని అన్నారు.

సీనియ‌ర్ న‌టి జ‌య‌ప్ర‌ద మాట్లాడుతూ, ` సినిమా ప‌రిశ్ర‌మ‌కు రావ‌డం  అనేది ఓ అదృష్టం. ఎక్క‌డో మారుమూల గ్రామం నుంచి బ‌స్సెక్కి వ‌స్తాం. కానీ ఇక్క‌డ అంద‌రూ స‌క్సెస్ కారు. ఆ అదృష్టం కొంద‌రికే ఉంటుంది. అలాంటి వాళ్ల‌లో నేను ఉన్నాను. ఈరోజు మీతో భాగం కావ‌డం చాలా సంతోషంగా ఉంది. అలాగే తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వ స‌హ‌కారం కూడా `మా` కు అందుతుండ‌టం ఆనందంగా ఉంది` అని అన్నారు.

'మా' అధ్య‌క్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ, ` సినిమా పెద్ద‌లంతా వెన్నుద‌న్నుగా ఉండ‌టం వ‌ల్లే ఈరోజు ఇలాంటి కార్య‌క్ర‌మాలు చేస్తున్నాం. మేము చేయాల‌నుకుంటోన్న ప‌నుల‌న్ని త్వ‌ర‌గతిన పూర్తిచేస్తాం. టాలీవుడ్ సెల‌బ్రిటీలంతా మంచి స‌హ‌కారం అందిస్తున్నారు. విదేశాల్లో ఈ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నాం. అందుకు స్టార్ హీరోలు చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున, వెంక‌టేష్, మ‌హేష్ బాబు, రామ్ చ‌ర‌ణ్ అంతా బాగా స‌హ‌క‌రిస్తామ‌న్నారు` అని అన్నారు.

జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ న‌రేష్ మాట్లాడుతూ, ` 1993లో చిరంజీవి గారు 'మా' కు దీపం వెల‌గించారు. త‌ర్వాత అంద‌రూ భాగ‌స్వాములైన అభివృద్ధి ప‌థంలో న‌డిపించారు. ఇప్పుడు `మా` భ‌విష్య‌త్ మ‌నంద‌రి చేతుల్లో ఉంది. అన్నీ స‌క్ర‌మంగా చేస్తాం. భార‌త‌దేశంలో ఎక్క‌డా జ‌ర‌గని విధంగా ఈ సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌లు ప్లాన్ చేసాం. గ్రాండ్ ఫినాలే హైద‌రాబాద్ లో చేస్తాం. ఈ వేడుక‌కు సౌత్ స్టార్స్ అంద‌రూ హ‌జ‌ర‌వుతారు. అలాగే శివాజీ..నేను ఇద్ద‌రం ఒకే మాట అనుకుంటాం. ఆ మాట మీద నిల‌బ‌డ‌తా. ఎలాంటి ఈగోలు లేకుండా ప‌నిచేస్తున్నాం. ఇక్క‌డ మా మ‌న‌సులు క‌లిసాయి కాబ‌ట్టే సంతోషంగా అన్ని ప‌నులు చేయ‌గ‌ల్గుతున్నాం` అని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో కోట శ్రీనివాస‌రావు, జీవితారాజ‌శేఖ‌ర్, ఆర్.నారాయ‌ణ‌మూర్తి, సాయిధ‌ర‌మ్ తేజ్, త‌రుణ్‌, హీరోయిన్ మెహ‌రీన్, ఎమ్. శ్రీకాంత్ (`మా`ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్), ఎమ్.వి. బెన‌ర్జీ (వైస్ ప్రెసిడెంట్), కె. వేణు మాధ‌వ్ (వైస్ ప్రెసిడెంట్), హేమ (జాయింట్ సెక్ర‌ట‌రీ), ఏడిద శ్రీరామ్ (జాయింట్ సెక్ర‌ట‌రీ), ప‌రుచూరి వెంకటేశ్వ‌ర‌రావు (ట్రెజ‌ర‌ర్), మా క‌ల్చ‌ర‌ల్ క‌మిటీ చైర్మ‌న్ సురేష్ కొండేటి, కార్య‌వ‌ర్గ సభ్యులు ఏ.ల‌క్ష్మీనారాయ‌ణ, ఏ. ఉత్తేజ్, అని చౌద‌రి, బి. గౌతం రాజు, సి. వెంక‌ట గోవింద‌రావు, ఎమ్. ధీర‌జ్, ప‌సునూరి శ్రీనివాసులు, గీతా సింగ్, ఎమ్. హ‌ర్ష వ‌ర్ధ‌న్ బాబు, హెచ్. జ‌య‌ల‌క్ష్మి, ఎస్. మోహ‌న్ మిత్ర‌, కొండేటి సురేష్‌, కుమార్ కోమాకుల‌, వి.ల‌క్ష్మీకాంత్ రావు, ఆర్. మాణిక్, సురేష్ పాల్గున్నారు.

Click here for Event Gallery