డిసెంబర్ 15న 'వెన్నెల' ఫేం జ‌య‌తి న‌టించిన 'ల‌చ్చి' గ్రాండ్ రిలీజ్

డిసెంబర్ 15న 'వెన్నెల' ఫేం జ‌య‌తి న‌టించిన 'ల‌చ్చి' గ్రాండ్ రిలీజ్

13-12-2017

డిసెంబర్ 15న 'వెన్నెల' ఫేం జ‌య‌తి న‌టించిన 'ల‌చ్చి'  గ్రాండ్ రిలీజ్

ఓ ప్రముఖ ఛానెల్లో వెన్నెల అనే పోగ్రాం ద్వారా బుల్లి తెర ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన జ‌య‌తి మెట్ట‌మెదటిసారిగా హీరోయిన్ గా న‌టిస్తూ నిర్మిస్తున్న చిత్రం ల‌చ్చి. J9 4షోస్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా ఈశ్వ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. హార్ర‌ర్ కామెడీ లో వైవిధ్యాన్ని ఈ చిత్రం ద్వారా ప‌రిచ‌యం చేస్తున్నారు.  డిసెంబర్ 15న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

ఈ సంద‌ర్బంగా నిర్మాత‌, క‌థానాయిక జ‌య‌తి మాట్లాడుతూ... "చాలా టీవి ప్రోగ్రామ్స్ ప్రొడ్యూస్ చేసిన అనుభవంతో మెట్ట‌మెద‌టిసారిగా సినిమా నిర్మాణం చేపట్టాను. అలాగే ఈ చిత్రం క‌థ న‌చ్చి నేను మెయిన్ లీడ్ లో న‌టించాను. హార్ర‌ర్ కామెడీ చిత్రాలు చాలానే వచ్చాయి. కానీ లచ్చి చిత్రం కొత్త అనుభూతిని అందిస్తుంది. వైవిధ్యమైన కథ, కథనం ప్రేక్షకుల్ని థ్రిల్ కు గురి చేస్తుంది.  ఈ చిత్రం అంతా ల‌చ్చి పాత్ర చుట్లూనే తిరుగుతుంది. అనేక మలుపులు ఆడియెన్స్ ని ఎంటర్ టైన్ చేస్తాయి. ప్ర‌ముఖ క‌మెడియ‌న్స్ కడుపుబ్బా నవ్విస్తారు. అలాగే లెజెండ్ కెమెరామెన్ యం.వి.ర‌ఘు గారితో ప‌నిచేయ‌టం చాలా ఆనందంగా వుంది. ఆయ‌న ఈచిత్రాన్ని మ‌రో మెట్టుకి తీసుకువెళ్ళారు. మాట‌లు మరుదూరి రాజా గారు అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్ 15న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం.  మా చిత్రాన్ని అంద‌రూ ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాము.  అని అన్నారు.

నటీనటులు  

హీరోయిన్ - జ‌య‌తి, తొలి పరిచయం -  తేజ‌శ్విని, దిలిప్‌; 
ఇతర తారాగణం - చంద్ర‌మెహ‌న్‌, పూర్ణిమ‌, శివ ప్రసాద్, రఘుబాబు, తాగుబోతు రమేష్, ధనరాజ్, షేకింగ్ శేషు, రాం ప్రసాద్

సాంకేతిక వర్గం

కెమెరా- యం.వి.ర‌ఘు, మాట‌లు- మ‌రుదూరి రాజా; సంగీతం- సురేష్ యువ‌న్‌, పాల్ పవన్; ఎడిట‌ర్‌- ప్ర‌భు; సాహిత్యం- కందికొండ‌
ఆర్ట్ - పార్థ సారధి వ‌ర్మ‌; కొరియోగ్రఫి - బృంద, క్రిష్ణారెడ్డి, అమిత్; ద‌ర్శ‌కుడు- ఈశ్వ‌ర్‌; నిర్మాత‌- జ‌య‌తి