మహాసభలకు తరలివచ్చిన తారాలోకం

మహాసభలకు తరలివచ్చిన తారాలోకం

19-12-2017

మహాసభలకు తరలివచ్చిన తారాలోకం

తెలుగుచిత్రసీమ, తెలుగు మహాసభలకు తరలివచ్చింది. సూపర్‌స్టార్‌, మెగాస్టార్‌లే కాక దిగ్గజాల్లాంటి నటులు, దర్శకులు, నిర్మాతలు తరలిరాగా లాల్‌బహదూర్‌ స్టేడియం తళుకులీనింది. ప్రపంచ తెలుగు మహాసభలు అత్యంత వైభవంగా జరుగుతుండగా, నాల్గవరోజు తెలుగుసినీలోకం మహాసభలకు తరలివచ్చింది. తెలుగుసినీరంగ అగ్రనటులు ఘట్టమనేని కృష్ణ, చిరంజీవి, మోహన్‌బాబు, బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, వెంకటేష్‌, జగపతిబాబు, నారాయణమూర్తి, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, తనికెళ్ళభరణి, విజయ్‌ దేవరకొండ, విజయనిర్మల, జయసుధ, జమున, హేమ, మా అధ్యక్షుడు శివాజీ రాజా, అగ్రదర్శకులు రాఘవేంద్రరావు, ఎస్‌ఎస్‌ రాజమౌళి, వంశీపైడిపల్లి, హరీష్‌శంకర్‌, నందినిరెడ్డి, నిర్మాతలు అశ్వనీదత్‌, అల్లు అరవింద్‌, దిల్‌రాజు, సురేష్‌ బాబు, జెమినికిరణ్‌, శ్యాంప్రసాద్‌రెడ్డి, సుధాకర్‌ రెడ్డి, సురేష్‌ కొండేటి తదితరులు పాల్గొన్నారు. సినీనటి ఉదయభాను అధ్యక్షతన సినీసంగీత విభావరి, సినీనటులను ఆహ్వానించే కార్యక్రమంగా జరగ్గా కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది.

Click here for Event Gallery