అమీర్‌ పేట్‌ టు అమెరికా

అమీర్‌ పేట్‌ టు అమెరికా

02-01-2018

అమీర్‌ పేట్‌ టు అమెరికా

రాధా మీడియా ఇన్‌కార్పొరేషన్‌ బ్యానర్‌లో రూపొందుతోన్న సినిమా ఎ టు ఎ, అమీర్‌ పేట్‌ టు అమెరికా. స్వప్న కొమండూరి సమర్పణ. మదన్‌ కొమండూరి, పద్మజ కొమండూరి నిర్మిస్తున్నారు. భానుకిరణ్‌ చల్లా దర్శకత్వం వహిస్తున్నారు. ఆ చిత్రానికీ కర్త, కర్మ క్రియ రామ్మోహన్‌ కొమండూరి. ఇంత వరకు ఏ చిత్రానికీ లేని విధంగా ఈ కర్త, కర్మ క్రియ అనే పదప్రయోగానికి కారణం.. ప్రీ ప్రొడక్షన్‌ నుండి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వరకు అన్ని క్రాప్ట్స్‌లో తన సహాయ సహాకారాలను అందిస్తూ, పూర్తి ఇన్‌వాల్వ్‌మెంట్‌తో ఆయన ఈ చిత్రాన్ని రూపొందించారు. ఎన్నో ఆశలతో అమీర్‌  పేట నుండి అమెరికాలో అడుగుపెట్టాలనుకునే యవత ఆలోచనలు, ఆశయాలు ఎలాంటివి? అమెరికా వెళ్లడానికి పడిన చిత్రవిచిత్రమైన తిప్పలు ఎలాంటివి? అనేవి చిత్రంలోని ప్రధాన అంశమని దర్శకుడు చెప్పారు.