మంచు కుటుంబంలో వారసుడొచ్చాడు

మంచు కుటుంబంలో వారసుడొచ్చాడు

02-01-2018

మంచు కుటుంబంలో వారసుడొచ్చాడు

మంచు కుటుంబంలో వారసుడు జన్మించాడు. మోహన్‌బాబు పెద్ద కుమారుడు, సినీ కథానాయకుడు మంచు విష్ణు సతీమణి వెరోనికా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పటికే ఈ దంపతులకు అరియానా, వినియానా అనే కవలు జన్మించిన విషయం తెలిసిందే. ఇటీవల విష్ణు తన ట్విట్టర్‌లో ఆడపిల్లయినా, మగ బిడ్డయినా తనకు సమానమేనని, ఎవరు పుట్టినా వారసులుగానే పరిగణిస్తానంటూ ట్వీటారు.