పెళ్లి చేసుకోకు ... పిల్లల్ని మాత్రం కను : రాణీ ముఖర్జీ
Sailaja Reddy Alluddu

పెళ్లి చేసుకోకు ... పిల్లల్ని మాత్రం కను : రాణీ ముఖర్జీ

09-01-2018

పెళ్లి చేసుకోకు ... పిల్లల్ని మాత్రం కను : రాణీ ముఖర్జీ

సుమారు దశాబ్ద కాలం నుంచి సల్మాన్‌ ఖాన్‌ పెళ్లి విషయమై వార్తలు వింటూనే ఉన్నాం. ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని ఎదురు చూస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కానీ జవాబు మాత్రం దొరకడం లేదని కొంత మంది సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, తాజాగా సల్మాన్‌  పెళ్లి గురించి బాలీవుడ్‌ వెటరన హీరోయిన్‌ రాణి ముఖర్జీ అసక్తికరంగా స్పందించింది. తన తాజా చిత్రం హిచ్‌కీ ప్రచారం కోసం సల్మాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌ బాస్‌-11కి రాణి ముఖర్జీ వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సల్మాన్‌ పెళ్లి గురించి ఒక సలహా ఇచ్చింది. సల్మాన్‌ పెళ్లి చేసుకోకూడదు. అయితే, పిల్లల్ని మాత్రం కనాలి. అప్పుడే నా కూతురు అదీరా ఆడుకోవడానికి తోడుదొరుకుతుంది. అలాగే సల్మాన్‌కు పుట్టబోయే పిల్లలు అచ్చం నాన్నలాగే అందంగా ఉండాలని ముఖర్జీ సలహా చెప్పింది.