నా తొలి ప్రేమను గెలవలేకపోయా

నా తొలి ప్రేమను గెలవలేకపోయా

09-01-2018

నా తొలి ప్రేమను గెలవలేకపోయా

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తన తొలి ప్రేమ గురించి విఫలమైనట్లు తెలిపారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన్ను టీనేజ్‌ లవ్‌ గురించి ప్రశ్నించగా, దీనిపై తలైవా స్పందిస్తూ, నాకు తొలి ప్రేమ ఉంది. నేను హైస్కూల్‌లో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డాను. చాలా మంది తమ తొలిప్రేమను గెలవగలిగారు. కానీ నేను ఆమె హృదయాన్ని గెలుచుకోలేపోయాను అని చెప్పారు. ఆనంతరం ఆమె పేరు చెప్పాల్సిందిగా కోరగా, చెప్పడానికి ఆయన నిరాకరించారు. ఆ తర్వాత మీ చిన్న, పెద్ద కోరికలు ఏంటి అని ప్రశ్నించగా, ఒక స్కూటర్‌, ఓ చిన్న ఇల్లుకట్టుకుని మధ్యతరగతి కుటుంబంలా జీవించాలన్నది నా చిన్న కోరిక, ఇక నా సినిమాల ద్వారా ప్రజలు, అభిమానులకు మంచి సందేశాలు అందిస్తూ వారి ముఖాల్లో చిరునవ్వు చూడాలి అనుకోవడమే నా పెద్ద కోరిక అని అన్నారు.