వివాదంలో కొడకా కోటేశ్వరరావు

వివాదంలో కొడకా కోటేశ్వరరావు

10-01-2018

వివాదంలో కొడకా కోటేశ్వరరావు

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కథనాయకునిగా తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమాలోని కొడకా కోటేశ్వరరావు పాట వివాదాల్లో చిక్కుకుంది. తన పేరుతో పవన్‌ పాడిన సాహిత్యం అవమానపరిచేదిగా ఉందంటూ విజయవాడకు చెందిన న్యాయవాది కోటేశ్వరరావు నగరంలోని మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ మనోభావాలు దెబ్బ తీసేలా పాట ఉందని ఆరోపించారు. తన తల్లిదండ్రులు సాక్షాత్తు మహాశివుని పేరు కోటేశ్వరరావు అని పెట్టారని, పాట విడుదలకు ముందు తనను కోర్టులోగాని, బయటగాని స్నేహితులు, సన్నిహితులు లాయర్‌ కోటేశ్వరరావు అని పిలిచేవారని, కాని పవన్‌ కల్యాణ్‌ పాట విన్నాక కొడకా కోటేశ్వరరావు అని పిలుస్తున్నారని దీనివల్ల తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పేర్కొన్నారు. సినిమాలో కొడకా కోటేశ్వరరావు పాట తొలగించాలని, పవన్‌, దర్శకుడు త్రివిక్రమ్‌, రచయిత, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తన తోటి న్యాయవాదులతో కలిసి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా పవన్‌ గొంతు సవరించుకుని పాడిన పాట వివాదాల్లో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది. విడుదలకు సిద్ధంగా ఉన్న అజ్ఞాతవాసిని ఈ వివాదం ఏ మలుపు తిప్పుతుందోనని సినీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.