శివాని ఎంట్రీ ఖరారు
MarinaSkies
Kizen

శివాని ఎంట్రీ ఖరారు

10-01-2018

శివాని ఎంట్రీ ఖరారు

ప్రముఖ నటుడు రాజశేఖర్‌ కూతురు శివానిని హీరోయిన్‌గా పరిచయం చేసేందుకు గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఎంట్రీ ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే, వినాయక్‌ దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన వెంకట్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే 2 స్టేట్స్‌ అనే బాలీవుడ్‌ చిత్రానికి రీమేక్‌ రూపొందిస్తున్నారు. అడివిశేష్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో శివాని హీరోయిన్‌గా నటించనుంది. 2 స్టేట్స్‌ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి తెరకెక్కిస్తారట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ పనులు మొదలయ్యాయని, త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. ఈ మధ్య హీరోల కూతుళ్ల హీరోయిన్లుగా ఎంట్రీ ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. మరి శివాని ఎలాంటి ఇమేజ్‌ తెచ్చుకుంటుందో చూడాలి.