పట్టుచీరపై అజ్ఞాతవాసి
MarinaSkies
Kizen

పట్టుచీరపై అజ్ఞాతవాసి

10-01-2018

పట్టుచీరపై అజ్ఞాతవాసి

తమ అభిమాననటుడు నటించిన అజ్ఞాతవాసి చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ను పట్టుచీర పై నేసి ఓ నేతన్న తమ అభిమానాన్ని చాటుకున్నాడు. అనంతపురం జిల్లా హిందూపురంలోని ముద్దిరెడ్డిపల్లికి చెందిన ఆర్‌.ఆనంద్‌ చిన్న నాటి నుంచి పవన్‌కల్యాణ్‌ కు వీరాభిమాని. పవన్‌ నటించిన అజ్ఞాతవాసి సినిమాకు సంబంధించి పవన్‌ కల్యాణ్‌ గిటారు వాయిస్తున్న చిత్రాన్ని తన సృజనతో పట్టుచీర అంచులపై నేశారు. కంప్యూటర్‌ జాకార్డును ధర్మవరంలో డిజైన్‌ను తయారు చేయించి ముద్దిరెడ్డి పల్లిలోని తమ మరమగ్లాల్లో పూర్తి పట్టుతో రెండురోజుల పాటు శ్రమించి తయారుచేశారు. ఈ డిజైన్‌ను రూపొందించడానికి సమారు 15 రోజుల సమయం పట్టిందని, చీర తయారీకి రూ.25 వేల ఖర్చుయిందని ఆనంద్‌ తెలిపారు. దీన్ని అతనికి బహుమతిగా ఇస్తానని తెలిపారు. తాను ఒక చీర మాత్రమే తయారు చేశానని కానీ, సమాచారం తెలుసుకున్న చాలా మంది చీరలు కావాలని ఆర్డర్లు ఇస్తున్నారని ఆనంద్‌ తెలిపారు.