ప్రపంచంలో నాకిష్టమైన వ్యక్తికి బర్త్‌ డే శుభాకాంక్షలు

ప్రపంచంలో నాకిష్టమైన వ్యక్తికి బర్త్‌ డే శుభాకాంక్షలు

10-01-2018

ప్రపంచంలో నాకిష్టమైన వ్యక్తికి బర్త్‌ డే శుభాకాంక్షలు

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన పర్సనల్‌ విషయాలు, సినిమాలు, సమాజంలో జరిగే పలు సంఘటనలకి సంబంధించి రెగ్యులర్‌గా ట్వీట్స్‌ చేస్తుంటాడు. బన్నీకి ట్విట్టర్‌లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా చాలా ఎక్కువే. కొద్ది సేపటి క్రితం తన ట్విట్టర్‌లో ప్రపంచంలోనే నాకు ఇష్టమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు ...లవ్‌ యూ అని తన తండ్రితో రీసెంట్‌గా దిగిన ఫోటోని షేర్‌ చేస్తూ ట్వీట్‌ చేశాడు అల్లు అర్జున్‌. ఈ రోజు మెగా ప్రొడ్యూసర్‌, గీతా ఆర్ట్స్‌ సంస్థ అధినేత అల్లు అరవింద్‌ బర్త్‌ డే సందర్భంగా బన్నీ ఈ ట్వీట్‌ చేశారు. ఇక అల్లూ మరో వారసుడు శిరీష్‌ కూడా తన తండ్రితో చిన్నప్పుడు దిగిన ఫోటోని షేర్‌ చేస్తూ బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపాడు. హ్యాపీ బర్త్‌డే డాన్‌ క్లోరియోన్‌. నేను ఎంత ఎదిగినా నా తొలి గుర్తింపు మాత్రం ఎప్పటికీ శిరీష్‌.. సన్‌ ఆఫ్‌ అల్లు అరవింద్‌ అనే ఉంటుంది. మై హీరో అని కామెంట్‌ కూడా పెట్టాడు వీరి పోస్ట్‌లకి నెటిజన్స్‌ కూడా వినూత్న కామెంట్స్‌ చేస్తున్నారు.