ఇందిర పాత్రలో విద్యాబాలన్‌

ఇందిర పాత్రలో విద్యాబాలన్‌

11-01-2018

ఇందిర పాత్రలో విద్యాబాలన్‌

బాలీవుడ్‌ హీరోయిన్‌ విద్యాబాలన్‌ మాజీ ప్రధాని ఇందిరాగాంధీగా కనిపించబోతున్నారు. ఇందిర రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కునున్న ఈ చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషించబోతున్నారు. ప్రముఖ విలేకరి సాగరికా ఘోష్‌ పుస్తకం ఇందిర ఇండియాస్‌ మోస్ట్‌ వపర్‌పుల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌పై విద్యాబాలన్‌ అనుసరణ హక్కులు సొంతం చేసుకున్నారు. ఇందిర పుస్తకంపై హక్కులు పొందడం సంతోషంగా ఉంది. అయితే సినిమా తీయాలా? వెబ్‌ సిరీస్‌ రూపొందించాలా? అనే దానిపై నిర్ణయం తీసుకోలేదు అని విద్యాబాలన్‌ అన్నారు. అటు ఇదిరాగాంధీపై తెరపై చూసేందుకు ఎదురుచూస్తున్నానని సాగరికా ఘోష్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.