సంక్రాంతికి అతిథి వస్తున్నాడు!

సంక్రాంతికి అతిథి వస్తున్నాడు!

13-01-2018

సంక్రాంతికి అతిథి వస్తున్నాడు!

సంక్రాంతి అనగానే అతిథులతో ఇల్లు సందడిగా మారిపోతుంటుంది. కథానాయకుడు పనవ్‌ కల్యాణ్‌ కూడా ఈ సంక్రాంతికి తన సినిమాతో  ఓ అతిథిని తీసుకొస్తున్నాడు. ఆయన ఎవరో కాదు వెంకటేష్‌.  పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన అజ్ఞాతవాసి లో వెంకటేష్‌ ఓ చిన్న పాత్రలో నటించారు. కారణాలేంటో తెలియదుకానీ, వెంకటేష్‌ నటించిన సన్నివేశాలు లేకుండానే సినిమాని విడుదల చేశారు. సంక్రాంతి పండగ రోజు నుంచి వెంకీ నటించిన సన్నివేశాల్ని సినిమాలో కలపబోతున్నారు. అందుకు సంబంధించిన మేకింగ్‌ వీడియోని కూడా విడుదల చేసింది చిత్రబృందం. దాన్ని బట్టి పవన్‌, వెంకీ సరదా సన్నివేశాలతో సందడి చేస్తారని తెలుస్తోంది.