మోహన్ బాబు నటించిన ‘గాయత్రి’ చిత్ర టీజర్ విడుదల!
Chal Mohan Ranga
Rangastalam
Krishnarjuna Yudham
Kizen
APEDB

మోహన్ బాబు నటించిన ‘గాయత్రి’ చిత్ర టీజర్ విడుదల!

13-01-2018

మోహన్ బాబు నటించిన ‘గాయత్రి’ చిత్ర టీజర్ విడుదల!

డా. మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ‘గాయత్రి’ చిత్ర టీజర్ నేడు విడుదలైనది. మోహన్ బాబు పవర్ఫుల్ ఫస్ట్ లుక్ కు అద్భుత స్పందన వచ్చింది. విలక్షణ నటుడు మళ్ళి తన నట విశ్వరూపం ప్రదర్శించనున్నారు. హై ఇంటెన్సిటీ కూడిన మోహన్ బాబు అప్పీరెన్స్, ఆయన నుంచి అభిమానులు కోరుకునే పవర్ఫుల్ డైలాగ్స్ చిత్రంలో ఆశించవచ్చని టీజర్ చెప్పగనే చెబుతుంది. 

"రామాయణంలో రాముడికి, రావణాసురుడికి గొడవ. మహాభారతంలో పాండవులకు, కౌరవులకు  మాత్రమే గొడవ. వాళ్ళు వాళ్ళు కొట్టుకుని ఎవరో ఒకరు చనిపోయుంటే బాగుండేది. కానీ వాళ్ళ మూలంగా జరిగిన యుద్ధంలో అటు ఇటు కొన్ని లక్షల మంది సైనికులు చనిపోయారు. పురాణాల్లో వాళ్ళు చేసింది తప్పయితే, ఇక్కడ నేను చేసింది కూడా తప్పే.. అక్కడ వాళ్ళు దేవుళ్లయితే ఇక్కడ నేను దేవుడినే. అర్థం చేసుకుంటారో అపార్థం చేసుకుంటారో..ఛాయస్ ఐస్ యువర్స్." అని మోహన్ బాబు పలికిన డైలాగ్ చిత్రం పై ఆసక్తిని మరింత పెంచుతోంది. 

ఫిబ్రవరి 9 న విడుదల కానున్న గాయత్రి చిత్రంలో విష్ణు మంచు ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. శ్రియ ఆయన సరసన నటిస్తుంది. బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, నిఖిల విమల్, అనసూయ భరద్వాజ్ ఇతర పాత్రలలో కనిపించనున్నారు. మదన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డా.యమ్.మోహన్ బాబు తన ప్రతిష్టాత్మక బ్యానర్ అయిన శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పై నిర్మించగా అరియానా, వివియానా మరియు విద్యా నిర్వాణ సమర్పిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సమకూరిచిన సంగీతం ఈ చిత్రానికి మరో హైలైట్.