ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతున్న దావోస్లో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ మెరిశారు. ఈ సందర్భంగా ఆయన్ను ప్రత్యేక అవార్డుతో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సత్కరించింది. బాలలు, మహిళల హక్కుల కోసం షారుక్ చేస్తున్న సేవలకుగాను ఆయన్ను క్రిస్టల్ అవార్డుతో గౌరవించింది.