"మెహ‌బూబా" టీజ‌ర్ విడుద‌ల

"మెహ‌బూబా" టీజ‌ర్ విడుద‌ల

09-02-2018

పూరీ జగన్నాథ్‌ త‌న‌యుడు ఆకాశ్ హీరోగా 'మెహ‌బూబా' అనే చిత్రం తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. 1971లో జరిగిన ఇండో పాక్ యుద్ధం నేపథ్యంలో పూరీ జ‌గ‌న్నాథ్ ఈ చిత్రాన్ని ల‌వ్ వార్ డ్రామాగా రూపొందిస్తున్న‌ట్టు స‌మాచారం. మంగళూరు అమ్మాయి నేహా శెట్టి ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్ర టీజర్‌ను చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది. ఇంటెన్స్ రొమాంటిక్ డ్రామాగా ఈ మూవీ ఉంటుంద‌ని టీజ‌ర్‌ని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది. టీజ‌ర్‌లో పూరి మార్క్ స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. పంజాబ్‌, హ‌ర్యానా, రాజ‌స్థాన్ రాష్ట్రాల‌ల‌లో చిత్రానికి సంబంధించి కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నారు. ఈ చిత్రానికి సందీప్ చౌతా సంగీతం అందిస్తున్నాడు.