'రంగ‌స్థ‌లం' రామ‌ల‌క్ష్మి టీజ‌ర్ విడుద‌ల

'రంగ‌స్థ‌లం' రామ‌ల‌క్ష్మి టీజ‌ర్ విడుద‌ల

09-02-2018

'రంగ‌స్థ‌లం' రామ‌ల‌క్ష్మి టీజ‌ర్ విడుద‌ల

రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత జంటగా నటిస్తున్న చిత్రం 'రంగ‌స్థ‌లం'. మార్చి 30న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్టారు మేక‌ర్స్‌. ఇటీవల ‘చిట్టిబాబు’గా రామ్‌చరణ్‌ను పరిచయం చేసిన చిత్రబృందం ఇప్పుడు సమంతను పరిచయం చేస్తూ టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో సమంత రామలక్ష్మి పాత్రలో నటిస్తున్నారు.  

టీజర్‌లో రామలక్ష్మి నడుచుకుంటూ వెళ్తుంటే బ్యాక్‌గ్రౌండ్‌లో చిట్టిబాబు ఆమెను కామెంట్‌ చేస్తూ ‘ఓహోహో ఏం వయ్యారం ఏం వయ్యారం ఏమాటకామాట సెప్పుకోవాలండీ ఈ పిల్ల ఎదురొత్తుంటే ఈ ఊరికే 18 సంవత్సరాలు వయసు వచ్చేసినట్టు ఉంటుంది. ఈ చిట్టిగాడి గుండెని గోలెట్టిచ్చేసింది ఈ పిల్లేనండి. పేరు రామలక్ష్మండి. ఊరు..’ అంటుండగా ‘రంగా..రంగస్థలానా’ అంటూ వస్తున్న నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది. ఫిబ్ర‌వరి 13 సాయంత్రం 5గం.ల‌కు చిత్రానికి సంబంధించి తొలిపాట విడుద‌ల కానుంది. 

సుకుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రిమూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆది పినిశెట్టి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.