రజనీతో పొత్తుకు ఓకే?

రజనీతో పొత్తుకు ఓకే?

09-02-2018

రజనీతో పొత్తుకు ఓకే?

సినీరంగంలోనే కాక తమిళ రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేకత చాటుకునేలా నటుడు కమల్‌ హాసన్‌ అడుగులు వేస్తున్నారు. తన రాజకీయ భవితపై ఆయన మాట్లాడుతూ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో తనతో ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని కలిసి పోటీ చేయాలని భావిస్తే అందుకు తాము సుముఖమే అన్నారు. కాకపోతే ఇరువురుం ఆలోచించాలిసిన అవసరం ఉందన్నారు. ఇదే విషయంపై రజనీకాంత్‌ను అడిగితే కాలమే దీనికి సమాధానం చెపుతుందంటున్నారు. కనుక ఈ కాలం ఎప్పుడూ అనేది ఆయనే చెప్పాలన్నారు. అయితే ముందుగానే రజనీతో పొత్తు నిర్ణయం ప్రకటించటం తొందరపాటు అవుతుందన్నారు. రజనీ సార్‌తో రాజకీయ పొత్తు అంటే సినిమా కోసం నటుడు ఎంచుకోవటం కాదన్నారు. ఇరువురుము భిన్న ధ్రువాలం అన్నారు. పొత్తు విషయంపై ఇరువురు ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉందన్నారు.