నేను కొడితే నుజ్జు నుజ్జు కావలసిందే

నేను కొడితే నుజ్జు నుజ్జు కావలసిందే

09-02-2018

నేను కొడితే నుజ్జు నుజ్జు కావలసిందే

హట్‌ బ్యూటీ సన్నీ లియోన్‌ తొలి సారి సౌత్‌లో సుమారు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఫుల్‌ ప్లెడ్జ్‌డ్‌ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ సౌత్‌ ఇండియన్‌ కల్చర్స్‌ బ్యాక్‌ డ్రాప్‌తో చారిత్రాత్మక యద్ధ నేపథ్యంలో తెరకెక్కనుంది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని వి.సి.వడివుడయన్‌ తెరకెక్కించనుండగా, స్టీవ్స్‌ కార్నర్‌ పతాకంపై పోన్స్‌ స్టిఫెన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 7న వీర మహాదేవీ షూటింగ్‌ మొదలు కాగా, సన్నీపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఇటుకలని ఒంటి చేత్తో పగలగొడుతున్న ఫోటోని ట్వీట్‌ చేసి, నేను కొడితే అన్ని ఇటుకులు దెబ్బకు నుజ్జునుజ్జు కావాల్సిందే అంటూ సన్నీ తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది. ఈ చిత్రంలో సన్నీ పవర్‌ పుల్‌ క్వీన్‌ గా కనిపించనుండగా నవదీప్‌, నాజర్‌లు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం కత్తి సాము, గుర్రపు స్వారీతోపాటు యద్దు సన్నివేశాల కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంది సన్నీ, భారీ బడ్జెట్‌  తో  తెరకెక్కనున్న ఈ సినిమా కోసం డైరెక్టర్‌ అండ్‌ టీంకు సన్నీలియోన్‌ 150 రోజుల కాల్షీట్లని ఇచ్చినట్లు సమాచారం. తమిళంలో వీరమాదేవి అనే టైటిల్‌ తో తెరకెక్కనున్న ఈ చిత్రం తెలుగులో వీరమహాదేవి పేరుతో రానుంది.