పెళ్లికి గ్రీన్ సిగ్నల్?

పెళ్లికి గ్రీన్ సిగ్నల్?

12-02-2018

పెళ్లికి గ్రీన్ సిగ్నల్?

తమిళ హీరో విశాల్‌ పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడు? ఇన్నాళ్లు పెళ్లి విషయాన్ని దాటవేస్తూ వస్తున్న విశాల్‌, ఫైనల్‌గా పెళ్లికి సిద్ధం అయినట్టు ఓ మీడియా సమావేశంలో చెప్పేశాడు. దాంతో విశాల్‌ పెళ్లిచేసుకునేది ఎవరిని అని గుసగుసలు ఎక్కువయ్యాయి. దానికి కారణం, విశాల్‌ గత కొంత కాలంగా శరత్‌కుమార్‌ అమ్మాయి వరలక్ష్మితో ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ మద్య శరత్‌కుమార్‌తో విశాల్‌కు నడిగర్‌ సంఘం విషయంలో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో వీరిద్దరూ దూరంగా వుంటున్నాని అంటున్నారు. ఇప్పటికే విశాల్‌ పలు కార్యరకమాలతో బిజీగా వున్నాడు. నడిగర్‌ సంఘానికి సంబంధించిన భవన నిర్మాణాన్ని చేయిస్తున్నాడు. ఆర్థికంగా చితికిన నటీనటులను ఆదుకుంటామని తెలిపారు. ఈ భవన నిర్మాణం అయ్యేవరకు పెళ్లిచేసుకోను అని చెప్పిన విశాల్‌, మొత్తానికి అనుకున్నట్టే భవనాన్ని ఓపెన్‌ చేయించాడు. మరి విశాల్‌ పెళ్లాడే అమ్మాయి ఎవరా? అని ఆరాలు ఎక్కువవుతున్నాయి.