అట్టహాసంగా ప్రారంభమైన ఆస్కార్ వేడుక

అట్టహాసంగా ప్రారంభమైన ఆస్కార్ వేడుక

05-03-2018

అట్టహాసంగా ప్రారంభమైన ఆస్కార్ వేడుక

 ప్రపంచంలో అతి పెద్ద సినీ పండుగ ఏదంటే అందరికి గుర్తుకొచ్చేంది ఆస్కార్‌ అవార్డుల పండుగ. ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరో, హీరోయిన్స్‌ కాక ప్రతీ టెక్నీషియన్‌ కూడా ఆస్కార్‌ అందుకోవాలని తహతహలాడుతుంటారు. లైఫ్‌ లో ఒక్కసారైనా ఆస్కార్‌ అవార్డు అందుకుందామని కలలు కంటూ ఉంటారు. ప్రతి ఏడాది ఎంతో ఘనంగా జరిగే అస్కార్‌ పండగ ఈ సారి లాస్‌ ఏంజెల్స్‌లో ఉన్న డాల్ఫీ థియేటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. 90వ ఆస్కార్‌ అవార్డుల వేడుకకి ప్రముఖ అమెరికన్‌ టెలివిజన్‌ హోస్ట్‌ జిమ్మీ కిమ్మెల్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఉత్తమ నటుడిగా గ్యారీ ఓల్డ్‌మస్‌ (డార్కెస్ట్‌ హవర్‌), ఉత్తమ నటి అవార్డును ఫ్రాన్సెస్‌ మెక్‌డార్మమండ్‌ (త్రి బిల్‌బోర్డ్స్‌ ఔట్‌సైడ్‌ ఎబింగ్‌, మిసోరి) సొంతం చేసుకున్నారు. ద షేప్‌ ఆఫ్‌ వాటర్‌ సినిమాకు గాను గిలెర్మో టోరో ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రంగా ద షేప్‌ ఆఫ్‌ వాటర్‌ కి ఆస్కార్‌ అవార్డ్‌ వరించింది.

13 నామినేషన్‌లతో ఆస్కార్‌ అవార్డుల రేసులో అగ్రభాగంలో నిలిచిన రొమాంటిక్‌ ఫాంటసీ చిత్రం ద షేప్‌ ఆఫ్‌ వాటర్‌ చిత్రం ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడితోపాటు, బెస్ట్‌ ప్రోడక్షన్‌ డిజైన్‌ అవార్డును ఎగిరేసుకుపోయింది. 8 నామినేషన్‌లతో రెండోస్థానంలో నిలిచిన డంకిర్క్‌, ఉత్తమ సౌండ్‌ ఎడిటింగ్‌, సౌండ్‌ మిక్సింగ్‌, ఉత్తమ ఫిలిం ఎడింటిగ్‌ మూడు విభాగాలలో అవార్డులు సొంతం చేసుకుంది. ఇక ఏడు నామినేషన్‌లతో మూడోస్థానం సాధించిన మార్టిన్‌ మెక్‌డొనాగ్స్‌ బ్లాక్‌ కామెడీ ద త్రి బిల్‌బోర్డ్స్‌ ఔట్‌సైడ్‌ ఎబింగ్‌, మిసోరి చిత్రానికి ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు సహా పలు అవార్డులు వరించాయి.