సల్మాన్ కంటే సన్నీ లియోన్ కోసమే ఎక్కువ వెతికారు

సల్మాన్ కంటే సన్నీ లియోన్ కోసమే ఎక్కువ వెతికారు

06-03-2018

సల్మాన్ కంటే సన్నీ లియోన్ కోసమే ఎక్కువ వెతికారు

గూగుల్‌ ద్వారా వికీపీడియా సెర్చ్‌లో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ కంటే ఎక్కువగా సన్నీ లియోన్‌ కోసమే వెతకడం ఆసక్తి రేపుతోంది. గత పదేళ్ల కాలంలో నెటిజన్లు బాలీవుడ్‌, హాలీవుడ్‌లకు చెందిన ఏ సెలబ్రిటీ కోసం ఎక్కువగా శోధించారన్న వివరాలను వికీపీడియా వెల్లడించింది. 2007 నుంచి 2017 మధ్య కాలంలో నెటిజన్లు శోధించిన 32 మంది బాలీవుడ్‌, హాలీవుడ్‌ సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ముగ్గురు బాలీవుడ్‌ నటులు స్థానం సంపాదించగా, ప్రముఖ హాలీవుడ్‌ నటులు లియోనార్డో డి కాప్రియో, బ్రాడ్‌ పిట్‌, టామ్‌ క్రూజ్‌, ర్యాన్‌ రేనాల్డ్స్‌ వంటి అగ్ర నటులను వెనక్కి నెట్టి మరీ బాలీవుడ్‌ బాద్షా షారూఖ్‌ ఖాన్‌ ద్వితీయ స్థానంలో నిలిచాడు. అగ్ర స్థానంలో అమెరికన్‌ టీవీ నటి కిమ్‌ కర్దాషియన్‌ ఉండటం విశేషం. బాలీవుడ్‌ అగ్రనటుడు సల్మాన్‌ ఖాన్‌ను వెనక్కి నెట్టి సన్నీ లియోన్‌ 20వ స్థానలో నిలవగా, సల్లూ భాయ్‌ 29వ స్థానంలో నిలిచాడు.