మూడు నెలల్లో దీపిక - రణ్ వీర్ వివాహం?

మూడు నెలల్లో దీపిక - రణ్ వీర్ వివాహం?

06-03-2018

మూడు నెలల్లో దీపిక - రణ్ వీర్ వివాహం?

బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. ఇక వరుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే రణ్‌వీర్‌ సింగ్‌ -దీపిక పదుకొణె ఎంతో కాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని నేరుగా వెల్లడించకపోయినా నేను రణ్‌వీర్‌తో ఉంటే ఇంకెవ్వరూ అక్కర్లేదనిపిస్తుంది అని చెప్పారు. అయితే వీరిద్దరికీ వివాహం జరిపించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించినట్లు బీటౌన్‌ టాక్‌. రణ్‌వీర్‌ తల్లిదండ్రులతో మాట్లాడేందుకు దీపిక తల్లిదండ్రులు బెంగళూరు నుంచి ముంబయి వచ్చినట్లు సమచారం. పెళ్లి గురించి ఇరు కుటుంబాలు చర్చించుకున్నాక సరదాగా అందరూ కలిసి ముంబయిలోని ఫోర్‌ సీజన్స్‌ హోటల్‌లో డిన్నర్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. మరో మూడు నెలల్లో దీపక-రణ్‌వీర్‌ వివాహం జరిగే అవకాశం ఉంది.