ఎయిర్‌పోర్ట్‌లో రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్

ఎయిర్‌పోర్ట్‌లో రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్

08-03-2018

ఎయిర్‌పోర్ట్‌లో రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్

రామ్ చ‌రణ్‌, ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజమౌళి దర్శకత్వంలో మ‌ల్టీ స్టార‌ర్ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌నుందనే వార్త వైర‌ల్ అవుతూనే ఉంది. ఈ మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు మాత్రం శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. జూలైలో పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకోనున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఆగ‌స్ట్‌లో సెట్స్ పైకి వెళుతుంద‌ని స‌మాచారం. ఆ టైం వ‌ర‌కు ఇటు చ‌ర‌ణ్ అటు ఎన్టీఆర్ త‌మ త‌మ ప్రాజెక్ట్స్‌ని పూర్తి చేసుకోనున్న‌ట్టు తెలుస్తుంది.

రాజ‌మౌళి నిర్వ‌హించ‌నున్న వ‌ర్క్ షాప్ కోసం ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌లు అమెరికా బ‌య‌లు దేరి వెళ్లిన‌ట్టు తెలుస్తుంది. అక్కడే ఎన్టీఆర్, చరణ్ లపై ఫోటో షూట్ ను కూడా ప్లాన్ చేశారట. ఈ ఫోటోల‌ని సినిమా ఎనౌన్స్‌మెంట్ టైంలో విడుద‌ల చేయ‌నున్నారని టాక్. మ‌ల్టీ స్టార‌ర్ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న రాశీ ఖ‌న్నాని క‌థానాయిక‌గా తీసుకోవాల‌ని భావిస్తుండ‌గా, చ‌ర‌ణ్ స‌ర‌స‌న స‌మంత న‌టిస్తుంద‌ని అంటున్నారు.