దర్శకుల సంఘం అధ్యక్షుడిగా ఎన్.శంకర్

దర్శకుల సంఘం అధ్యక్షుడిగా ఎన్.శంకర్

12-03-2018

దర్శకుల సంఘం అధ్యక్షుడిగా ఎన్.శంకర్

తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడిగా ఎన్‌.శంకర్‌ ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ఎన్నికల్లో సానా యాదిరెడ్డిపై ఆయన 310 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎన్‌.శంకర్‌తో పాటు ఆయన ప్యానల్‌కు చెందిన జి.రామ్‌ప్రసాద్‌ ప్రధాన కార్యదర్శిగా, కాశీ విశ్వనాథ్‌ కోశాధికారిగా, ఎ.ఎస్‌. రవికుమార్‌ చౌదరి, ఎస్‌.వి.భాస్కర్‌రెడ్డి ఉపాధ్యాక్షులుగా, కె.రంగరావు, ఎమ్‌.సత్య శ్రీనివాస్‌ సంయుక్త కార్యదర్శులుగా, డి.వి.రాజు(కళింగ), ఎన్‌.గోపీచంద్‌ కార్యనిర్వాహక కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. ఈ కార్యవర్గం రెండేళ్లపాటు కొనసాగుతుంది.