ఇక ఏమాత్రం ఆగేది లేదు... పెళ్లి చేసుకుంటా

ఇక ఏమాత్రం ఆగేది లేదు... పెళ్లి చేసుకుంటా

12-03-2018

ఇక ఏమాత్రం ఆగేది లేదు... పెళ్లి చేసుకుంటా

తాను పెళ్లికి సిద్ధమైనట్లు ప్రముఖ హాలీవుడ్‌ నటి కాలీ కువాకో సృష్టం చేశారు. తన సోల్‌మేట్‌ కార్ల్‌కుక్‌నే తాను వివాహం చేసుకోబోతున్నానని, ఇక ఏమాత్రం ఆగేది లేదని సృష్టం చేశారు. బిగ్‌ బ్యాంగ్‌ థీయరీ చిత్రంలో నటించిన ఈ 32 ఏళ్ల భామ గత నవంబర్‌లో తన పుట్టిన రోజున బోయ్‌ఫ్రెండ్‌తో నిశ్చితార్థం అయింది. ప్రస్తుతం వారిద్దరు కూడా చాలా గ్రాండ్‌గా పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. మొత్తానికి మేం పెళ్లి చేసుకోబోతున్నాం. అందుకే ప్లానింగ్‌ ఆలోచిస్తున్నాం. ఇక ఎంతో కాలం నేను వేచి చూడలేను. అది జోక్‌ చెప్పడం లేదు. ముమ్మాటికీ నిజం. అతడిని విడిచి ఉండలేకపోతున్నాను. ప్రేమలో మేమిద్దరం చాలా ఆనందంగా ఉన్నాం. నాలాగే ఆయన కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మొత్తానికి నేను నా భాగస్వామిని గుర్తించగలిగాను అని ఆమె చెప్పుకొచ్చింది. కువాకో, కుక్‌ మధ్య రోమాన్స్‌ నడుస్తోందని తొలిసారి 2016 మార్చిలో వార్తలు రాగా వారి బంధాన్ని అదే ఏడాది సెప్టెంబర్‌లో సృష్టం చేశారు. ఒకరి ఫొటోలు మరొకరు పోస్ట్‌ చేయడం ద్వారా వారి ప్రేమను బయపెట్టారు.