వంకాయల సత్యనారాయణ ఇక లేరు

వంకాయల సత్యనారాయణ ఇక లేరు

13-03-2018

వంకాయల సత్యనారాయణ ఇక లేరు

ప్రముఖ సినీ, రంగస్థల సీనియర్‌ నటుడు, దర్శకుడు వంకాయల సత్యనారాయణ (78) ఇక లేరు. నటుడిగా సుమారు నాలుగు దశాబ్దాలపాటు వెండితెరపై విభిన్న పాత్రల్ని పండిచిన ఆయన తన నివాసంలో మృతి చెందారు. కొద్ది కాలంగా శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతూ విశాఖలోని తన కుమార్తె ఇంట్లో తుదిశ్వాస విడిచారు. 1940లో విశాఖపట్నం చవలవారి వీధిలో సత్యనారాయణ జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, అనారోగ్యంతో బాధపడుతూ కుమార్తె ఇంట్లోనే ఉంటున్నారు. నెల క్రితం కళాభారతి ఆడిటోరియంలో ప్రదర్శించిన ఒక నాటకంలో ముఖ్యపాత్ర పోషించి మెప్పించారు. నడవలేని స్థితిల్లో ఉన్నా నాటకాలంటే ఆయనకు ఎంతో మక్కువ. నాటక రంగం నుంచే 'నీడలేని ఆడది' సినిమాతో చిత్ర రంగప్రవేశం చేశారు. సీతామాలక్ష్మీ, శ్రీనివాస్‌ కల్యాణం, శుభలేఖ, దొంగకోళ్లు, విజేత వంటి చిత్రాలతోపాటు 160కి పైగా చిత్రాల్లో, పలు సీరియల్స్‌లో నటించారు. వందలాది రంగస్థలా ప్రదర్శనలు ఇచ్చారు.