ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష
APEDB

ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష

14-03-2018

ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష

కేంద్రం ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాను ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రకటించకపోతే అమరణ నిరాహార దీక్ష చేస్తానని సినీనటుడు శివాజీ వెల్లడించారు. విజయవాడలో ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేసిన మోదీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ మరింత పోరాడేందుకు ఈనెల 19న అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని, భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామని వివరించారు. రాయలసీమపై మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు.