'కృష్ణార్జున‌యుద్ధం' ఏప్రిల్ 12న గ్రాండ్ రిలీజ్‌

'కృష్ణార్జున‌యుద్ధం' ఏప్రిల్ 12న గ్రాండ్ రిలీజ్‌

14-03-2018

'కృష్ణార్జున‌యుద్ధం' ఏప్రిల్ 12న గ్రాండ్ రిలీజ్‌

`ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం నుండి రీసెంట్‌గా విడుద‌లైన `ఎంసీఏ` వ‌ర‌కు ఎనిమిది వ‌రుస స‌క్సెస్‌ఫుల్ చిత్రాలతో మెప్పిస్తున్న నేచర‌ల్ స్టార్ నాని హీరోగా ద్విపాత్రాభిన‌యంలో న‌టిస్తున్న చిత్రం `కృష్ణార్జున యుద్ధం`. వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి స‌మ‌ర్ప‌ణ‌లో షైన్ స్క్రీన్న్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  `వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌`, `ఎక్స్‌ప్రెస్ రాజా` చిత్రాల ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక ద‌ర్శ‌క‌త్వంలో ఈ  సినిమా తెర‌కెక్కుతోంది. అనుపమ పరమేశ్వరన్ మరియు రుఖ్సార్ మీర్ ఈ చిత్రం లో నాయికలు గా నటిస్తున్నారు. ఇటీవల విడుదల అయినా టీజర్ 2.5 మిలియన్స్ వ్యూస్ తో, 'ఐ వన్నా ఫ్లై' 'దారి చూడు మామ' మరియు 'ఉరిమే మనసే'  సాంగ్స్ కి సంబంధించిన ట్రైలర్స్ నాని చిత్రాల్లో కెల్లా అత్యధికంగా వ్యూస్ రికార్డు అవుతున్నాయి.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం  ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 12న గ్రాండ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి హిప్ హాప్ సంగీతాన్ని అందిస్తుండ‌గా, కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ : "నేను మూడవ సారి డ్యూయెల్ రోల్ చేస్తున్న చిత్రం 'కృష్ణార్జున యుద్ధం' గతం లో జండాపై కపి రాజు లో అరవింద్ శివ శంకర్, మాయ కన్నన్ గా, జెంటిల్మన్ చిత్రం లో గౌతమ్, జై పాత్రలలో చేశాను ఈ సారి నా పాత్రల పేర్లతో కృష్ణ మరియు అర్జున్ గా ఈ చిత్రం లో నటిస్తున్నాను. నా సరసన  అనుపమ పరమేశ్వరన్ మరియు రుఖ్సార్ మీర్ హీరోయిన్లు గా చేస్తున్నారు. ఎక్స్‌ప్రెస్ రాజా వంటి డిఫరెంట్ మూవీ చేసిన  ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ మంచి సబ్జెక్టు ఇచ్చాడు. నిర్మాతలు సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది వారికి ఇది తొలి చిత్రమైనా ఎక్కడ కంప్రమైస్ కాలేదు. చిత్రం అద్భుతం గా వచ్చింది. ముఖ్యంగా యూత్ ని మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది." అన్నారు

దర్శకుడు మేర్ల‌పాక గాంధీ మాట్లాడుతూ :" నాని గత చిత్రాల కు ఏ మాత్రం తగ్గకుండా అయన ఇమేజ్ కి సరిపడా సబ్జెక్టు ఇది. ఇటీవల విడుదల చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చంది అలాగే  మ్యూజిక్ డైరెక్టర్  హిప్ హాప్ అందించిన పాటలు  'ఐ వన్నా ఫ్లై' 'దారి చూడు మామ' మరియు 'ఉరిమే మనసే' ఇప్పటికే యు ట్యూబ్ లో హైయెస్ట్ వ్యూస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాయి.సీనియర్  ఎన్టీర్, ఎన్నార్ లు నటించిన  'శ్రీ కృష్ణార్జున యుద్ధం' టైటిల్  ప్రతిష్టను ఏ మాత్రం తగ్గించదని మా చిత్రం పై నమ్మకంతో చెపుతున్నాను." అన్నారు.

నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ :"కృష్ణార్జున యుద్ధం" ఈ చిత్రం  నాని కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ గా నిలపడుతుంది. అన్ని వర్గాల ప్రేక్షుకులను ఆకట్టుకుంటుంది. కొత్త నిర్మాతలమైనా హీరో నాని, దర్శకుడు గాంధీ గార్ల సహకారం ఈ చిత్రం బాగా రావడం లో తోడ్పడింది.ప్రస్తుతం పోస్ట్స  ప్రొడక్షన్ జరుగుతుంది  స్పెషల్ గా ఏప్రిల్12న ఈ చిత్రం విడుదల చేస్తున్నాము" అన్నారు.  

మరో నిర్మాత హరీష్ పెద్ది మాట్లాడుతూ : " "కృష్ణార్జున యుద్ధం"  పూర్తి అయ్యింది. ఏప్రిల్ 12 న రిలీజ్ అవుతుంది తప్పని సరిగా పెద్ద హిట్ అవుతుంది. ఈ లోగా మరో చిత్రానికి శ్రీ కారం చుట్టాము.