నెరవేరని మెగాస్టార్ చిరంజీవి కోరిక
APEDB

నెరవేరని మెగాస్టార్ చిరంజీవి కోరిక

19-04-2017

నెరవేరని మెగాస్టార్ చిరంజీవి కోరిక

స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ పాత్రను వెండితెరపై పోషించాలని కలలుకన్నారు. కానీ అనివార్య కారణాల వల్ల  ఆ కోరిక తీరలేదు అని అన్నారు ప్రముఖ నటుడు చిరంజీవి. ఖైదీ నంబర్‌ 150 చిత్రంతో తొమ్మిదేళ్ల విరామం అనంతరం సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఆయన ప్రస్తుతం ఓ పాపులర్‌ టీవీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. తన సుదీర్గ సినీ ప్రయాణంలో మెగాస్టార్‌కు ఓ కోరిక మిగిలిపోయిందట. దాని గురించి ఇటీవల ఆయన టీవీ షోలో మాట్లాడారు. భగత్‌సింగ్‌ పాత్రను నా సమకాలీనులంతా చేశారు. దేశం కోసం ప్రాణాలను అర్పించిన అలాంటి గొప్ప వీరుడి పాత్రలో నేను నటించలేకపోయాననే బాధ మాత్రం అలాగే మిగిలిపోయింది. భగత్‌సింగ్‌ పాత్రలో నటించినే అవకాశం వచ్చిన కొన్ని కారణాల వల్ల అది చేజారిపోయింది. ఆయన జీవితంపై భిన్న భాషల్లో పలు సినిమాలు రూపొందాయి. దాంతో భగత్‌సింగ్‌పై మల్లీ సినిమాల్ని రూపొందించడానికి ఎవరూ ముందుకు రావకపోవచ్చు అని అన్నారు.