ఘనంగా ప్రవరవేదిక ఉగాది ఉత్సవాలు

ఘనంగా ప్రవరవేదిక ఉగాది ఉత్సవాలు

06-04-2018

ఘనంగా ప్రవరవేదిక ఉగాది ఉత్సవాలు

న్యూజెర్సిలో వాట్సాప్‌ గ్రూపుగా ప్రారంభమైన బ్రాహ్మణ సంస్థ ప్రవర వేదిక ఇంతింతై వటుడింతయైనంతగా విస్తరించి నేడు వందలాదిమంది సభ్యులతో విరాజిల్లుతోంది. ప్రవరవేదికను అధికారికంగా లాంఛనప్రాయంగా ప్రారంభించడంతోపాటు విళంబినామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో ఎంతోమంది ప్రముఖులు, సభ్యులు పాల్గొన్నారు. ఫౌండింగ్‌ సభ్యురాలైన భాను దివాకర్లతోపాటు ప్రవర వేదిక ప్రముఖులు శ్రీ హిమకుంట్ల, శ్రీనివాస్‌ వ్యాకరణం, అరుణ్‌ వడ్లమాని, దాన్‌ నందన్‌, సత్య ఆలూరు, సుబ్బా తోలేటి, సావిత్రి సిస్ట్ల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ప్రవర వేదికను మరింతగా బలపరచాల్సి ఉందని, ఇందుకు వీలుగా మరిన్ని సభ్యత్వాలను చేర్పించాలని కోరారు. మన బ్రాహ్మణకుటుంబం మరింతగా విస్తరించాలన్న ఉద్దేశ్యంతోనే ప్రవరవేదిక కల్యాణ వేదికను కూడా ప్రారంభించిందని, దీని ద్వారా పరిచయాలు పెరిగి పిల్లలు మనవాళ్ళనే పెళ్ళి?చేసుకునేందుకు అవకాశం కలుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు.

Click here for Event Gallery