ఆపి కార్యవర్గంలో గుంటూరు వైద్యుడు సుధాకర్‌ జొన్నలగడ్డ
APEDB

ఆపి కార్యవర్గంలో గుంటూరు వైద్యుడు సుధాకర్‌ జొన్నలగడ్డ

20-04-2017

ఆపి కార్యవర్గంలో గుంటూరు వైద్యుడు సుధాకర్‌ జొన్నలగడ్డ

అమెరికాలో అతి పెద్ద రెండవ వైద్య సంఘంగా పేరు పొందిన అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స ఆఫ్‌్‌ ఇండియన్‌ ఆరిజన్‌ (ఆపీ) కార్యదర్శిగా డాక్టర్‌ సుధాకర్‌ జొన్నలగడ్డ ఎన్నికయ్యారు. భారతీయ సంతతికి చెందిన సుమారు లక్షన్నర మంది డాక్టర్లు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఏప్రిల్‌ 14వ తేదీన వైద్యుల సంఘానికి ఎన్నికలు జరగ్గా, మరుసటి రోజు ఫలితాలను ప్రకటించారు. డాక్టర్‌ సుధాకర్‌ స్వస్థలం గుంటూరు నగరం. ఆయన తండ్రి  డాక్టర్‌ వీరాస్వామి నాయుడు గుంటూరు డీఎంహెచ్‌వోగా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. సోదరుడు కూడా వైద్యుడే. కాకినాడ రంగరాయ మెడికల్‌ కాలేజీలో డాక్టర్‌ సుధాకర్‌ జొన్నలగడ్డ ఎంబీబీఎస్‌ చేశారు. అమెరికాలో  ఉన్నత విద్యను అభ్యసించి, ప్రస్తుతం అమెరికాలో స్థిరపడి జీర్ణకోశ వ్యాధుల వైద్యనిపుణులుగా పని చేస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఆప్‌ ఇండియన్‌ ఆరిజన్‌ కార్యదర్శిగా ఎన్నికవ్వడం పట్ల డాక్టర్‌ సుధాకర్‌ జొన్నలగడ్డ ఆనందం వ్యక్తం చేశారు. తమ సంఘం తరపున భారతలో బేసిక్‌ లైఫ్‌ సపోర్ట్‌, అడ్వాన్స్‌డ్‌ కార్డియాక్‌ లైఫ్‌ సపోర్ట్‌ శిక్షణ కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. వైద్య రంగంలో పని చేసే డాక్టర్లతో పాటు సహాయ సిబ్బంది కూడా ఈ కోర్సుల్లో  శిక్షణ పొందటం అవసరమని ఆయన చెప్పారు.కాలేయ వ్యాధుల్లో ముఖ్యంగా, హెపటైటిస్‌ బీ, హెపటైటిస్‌ సీ ఇన్‌ఫెక్షన్లను మాస్‌ స్క్రీనింగ్‌ ద్వారా వ్యాధి తొలి దశలో గుర్తించి తగిన చిక్సితలు పొందే విషయంపై ప్రచార కార్యక్రమాలు చేపడతామని డాక్టర్‌ సుధాకర్‌ వెల్లడించారు.