కన్నుల పండుగగా క్యాట్స్ ఉగాది వేడుకలు

కన్నుల పండుగగా క్యాట్స్ ఉగాది వేడుకలు

13-04-2018

కన్నుల పండుగగా క్యాట్స్ ఉగాది వేడుకలు

క్యాపిటల్‌ ఏరియా తెలుగు సొసైటీ (కాట్స్‌)  ఆధ్వర్యంలో విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను, శ్రీరామ నవమిని మార్చి 31వ తేదీన  కన్నుల పండువగా నిర్వహించారు. యాష్‌బర్న్‌ లోని స్థానిక బ్రాడ్‌ రన్‌ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈవేడుకలకు వెయ్యిమందికి పైగా పాల్గొన్నారు. ఈవేడుకలలో భాగంగా నిర్వహించిన చదరంగం, షార్ట్‌ ఫిలిం, టేబుల్‌ టెన్నిస్‌, డిబేట్‌ తదితర పోటీలలో సుమారు 250 మందికి పైగా చిన్నారులు పాల్గొన్నారు. వీటితోబాటు పంచాంగ శ్రవణం, శాస్త్రీయ, జానపద, సినీ   సాంస్కృతిక కార్యక్రమాలు, ఫాషన్‌ షో హైలైట్‌ గా నిలిచాయి. ఇక గాయకులు కిరణ్‌ మరియు మానస తమ పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

Click here for Event Gallery