చరిత్రలో ఇదే అత్యల్పం... బాగా తగ్గిన హెచ్1 బీ దరఖాస్తులు

చరిత్రలో ఇదే అత్యల్పం... బాగా తగ్గిన హెచ్1 బీ దరఖాస్తులు

14-04-2018

చరిత్రలో ఇదే అత్యల్పం... బాగా తగ్గిన హెచ్1 బీ దరఖాస్తులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆంక్షల నేపథ్యంలో హెచ్‌-1బీ వీసా కోసం అభ్యర్థించే భారతీయుల సంఖ్య వరుసగా రెండో ఏడాది తగ్గింది. ఈ ఏడాది చరిత్రలో ఎన్నడూ లేనంతగా అభ్యర్థుల సంఖ్య 43 శాతం తగ్గిందని అమెరికాకు చెందిన ఇమ్మిగ్రేషన్‌ సంస్థ వెల్లడించింది. ఈ సంఖ్య 2007లో అందిన 3,14,621 అప్లికేషన్ల తరువాత ఇదే అత్యల్పం. ఇంతకు ముందు ఇది 2017లో 3,99,349 అభ్యర్థునల నుండి 3,36,107కు తగ్గింది. 2018లో ఉద్యోగాలకు దాదాపు 1.90 లక్షల హెచ్‌-1బి వీసా దరఖాస్తులు అందాయి. 2018-19 సంవత్సరం కోసం అక్టోబర్‌ 1 నుండి వీసాను ఇవ్వనున్న నేపథ్యంలో గత ఏడాదితో పోలిస్తే 8,902 అభ్యర్థనలు తక్కువగా వచ్చాయి. అమెరికా పౌరసత్వం మరియు ఇమ్మిగ్రేషన్‌ సంస్థ 2018-19 సంవత్సరానికి అభ్యర్థనల కోటాను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయ్యనుంది. ఈ అభ్యర్థనలు 2016-17 సంవత్సరాలకు అత్యధికంగా 2.36 లక్షలుగా నమోదయ్యాయి. ఏప్రిల్‌ 2, 6 తేదీల్లో అభ్యర్థనలను ఆహ్వానించగా తగిన సంఖ్య కన్నా ఎక్కువే  వచ్చాయని ఆ సంస్థ పేర్కొంది. హెచ్‌-1 బి వీసా కోసం జనరల్‌ కోటాలో పరిమితి 65 వేలు కాగా, అడ్వాన్సుడ్‌ డిగ్రీ హోల్డర్స్‌ అభివర్ణించే మాస్టర్స్‌ క్యాప్‌ కోసం పరిమితి 20వేలు. కంప్యూటర్‌ జనరేటేడ్‌ ర్యాండమ్‌ సెలక్షన్‌ (లాటరీ) పద్ధతిలో ఎంపిక జరుగుతుందని సంస్థ ఏప్రిల్‌ 11న ఇచ్చిన ప్రకటనలో తెలిపింది. ఇమిగ్రేషన్‌ సంస్థ ప్రస్తుతం ఎంపిక కాని అభ్యర్థునలను వారు కట్టిన ఫీజుతో పాటు తిప్పి పంపే ప్రక్రియను ప్రారంభించనుంది.