అమరావతిలో ఎన్ ఆర్ టీ ఐకాన్

అమరావతిలో ఎన్ ఆర్ టీ ఐకాన్

16-04-2018

అమరావతిలో ఎన్ ఆర్ టీ ఐకాన్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతిలోని పరిపాలనా నగరంలో ప్రవాసాంధ్రులకు ఏపీ ఎన్‌ఆర్‌టీ సొసైటీ సంస్థ ఎన్‌ఆర్‌టీ ఐకాన్‌ పేరుతో భారీ భవనాన్ని నిర్మించనుంది. ఐదు ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.400 కోట్ల అంచనా వ్యయంతో జంట టవర్లుగా దీనిని నిర్మిస్తారు. పోడియంతో కలిపి 36 అంతస్తులు ఉంటాయి. కేవలం ప్రవాసాంధ్రుల కోసమే, వారి నిధులతోనే నిర్మించే ఈ భవనంలో నివాస, కార్యాలయ వసతులు ఉంటాయి. వీటిలోని ఫ్లాట్లను, కార్యాలయ ప్రాంతాన్ని వారికే  విక్రయిస్తారు. ఈ నెలాఖరులో  లేదా మే మొదటి వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తారు. దీనిలో ఏర్పాటయ్యే కార్యాలయాల్లో ఐదారు వేల మందికి ఉన్నతస్థాయి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని ఎన్‌ఆర్‌టీ సొసైటీ అధ్యక్షుడు వేమూరి రవికుమార్‌ తెలిపారు. కొరియాకి చెందిన స్పేస్‌ కార్పొరేషన్‌ సంస్థ ఆకృతి రూపొందించింది. మరో అంతర్జాతీయ సంస్థ కుష్మన్‌ వేక్‌ ఫీల్డ్‌ మార్కెటింగ్‌ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తోంది.