ఆ పదవికి డొనాల్డ్ ట్రంప్ అనర్హుడు

ఆ పదవికి డొనాల్డ్ ట్రంప్ అనర్హుడు

16-04-2018

ఆ పదవికి డొనాల్డ్ ట్రంప్ అనర్హుడు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నైతికంగా ఆ పదవికి అనర్హుడని ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్విస్టిగేషన్‌ (ఎఫ్‌బిఐ) మాజీ డైరెక్టర్‌ జేమ్స్‌ కోమే అన్నారు. స్థానిక మీడియాకు వచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను కోమే వెల్లడించారు. అతనిని బెదిరించడానికి అవసరమైన సాక్ష్యాలు రష్యన్ల దగ్గర ఉన్నాయన్నారు. ట్రంప్‌ పాలనను మాఫియా డాన్‌తో పోల్చుతూ తాను రాసిన పుస్తకంలో పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా కోమ్‌ ప్రస్తావించారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి మూలాల్ని గౌరవించాలని, విలువలకు కట్టుబడి ఉండాలని, కానీ ట్రంప్‌ అలా చేయడం లేదని ఆయన విమర్శించారు. 2017 మేలో కోమేను పదవినుండి తొలగించారు. ఎన్నికల సమయంలో హిల్లరీ క్లింటన్‌పై, ట్రంప్‌ ప్రచార కార్యక్రమంలో రష్యా కుట్ర అంశాలపై విచారణ సమయంలో ఎఫ్‌బిఐ సరిగా పనిచేయలేదని కోమెను పదవి నుండి తప్పించిన విషయం తెలిసిందే.