TANA
Telangana Tourism

డెమోక్రాట్ నేత శాండర్స్ కి అధిక ప్రజాదరణ

21-04-2017

డెమోక్రాట్ నేత శాండర్స్ కి అధిక ప్రజాదరణ

అమెరికాలో అత్యంత ప్రజాదరణ గల రాజకీయ నాయకుడు వెర్మాంట్‌ సెనేటర్‌ బెర్నీ శాండర్స్‌ అని ఒక ఒపీనియన్‌ పోల్‌లో వెల్లడైంది. ఆయనకు అనుకూలంగా 57 శాతం ఓట్లు పోలయ్యాయి. యువతలో ముఖ్యంగా 18 నుండి 34 ఏళ్ల మధ్య వయస్సు గలవారిలో ఆయనకు ఆదరణ ఎక్కువగా వుందని, వారు ఆయనకు 62శాతం ఓట్లు వేశారని తెలిపింది. 50కి పైబడిన వయస్సు గల వారిలో కూడా ఆయన పట్ల అభిమానం ఎక్కువగానే వుందని హార్వర్డ్‌ హారిస్‌ తాజా సర్వేలో వెల్లడైంది.