భారీ స్థాయిలో తగ్గిన హెచ్-1బీ దరఖాస్తులు

భారీ స్థాయిలో తగ్గిన హెచ్-1బీ దరఖాస్తులు

17-04-2018

భారీ స్థాయిలో తగ్గిన హెచ్-1బీ దరఖాస్తులు

హెచ్‌ 1 బీ వీసాల జారీలో ఎప్పుడూ భారతీయుల వాటానే ఎక్కువ. కానీ, మొట్టమొదటిసారి మన దేశం నుంచి హెచ్‌ 1బీ దరఖాస్తుల సంఖ్య తగ్గిపోయింది. ద యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్స్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) గణాంకాల ప్రకారం 2019కి గాను 1,90,098 హెచ్‌ 1బీ పిటిషన్లు వచ్చాయి. మునుపెన్నడూ ఇంత తక్కువ సంఖ్యలో రాలేదు. 2007లో హెచ్‌-1బీని ప్రవేశపెట్టినప్పుడు 3,14,621 దరఖాస్తులు వచ్చాయి. 2016లో 3,99,349 దరఖాస్తులు రాగా, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ వచ్చాక ఆ సంఖ్య 3,36,107కు తగ్గింది. అమెరికన్‌ యువతకే ఉద్యోగాలనే విషయంలో ట్రంప్‌ కఠిన వైఖరి అవలంబిస్తుండడంతో మన కంపెనీలు ఇక్కడి నుంచి అక్కడికి ఉద్యోగులను తీసుకెళ్లడం తగ్గింది. అమెరికన్లకే అవకాశాలు కల్పించాలని నిశ్చయించుకున్నాయి.