ఆ దేశాలపై అమెరికా దాడులు జరపాలి

ఆ దేశాలపై అమెరికా దాడులు జరపాలి

17-04-2018

ఆ దేశాలపై అమెరికా దాడులు జరపాలి

ఉగ్రసంస్థలకు మద్దతిస్తున్న దేశాలపై దాడులు జరపాలని అమెరికాను ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ కోరారు. ఐఎస్‌కు సహకరిస్తున్న దేశాలపై సైనిక చర్యలకు దిగడం తప్పేమీ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సిరియాలో ఈ నెల 7న జరిగిన రసాయనిక దాడిలో 70 మంది మృతి చెందారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. సిరియాలో సరిస్‌ నర్వ్‌ఏజెంట్‌ ప్రయోగం జరగడంతో భారీ ప్రాణనష్టం జరిగింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలపై దాడులకు దిగడమే ఏకైక మార్గమని నెతన్యాహూ పేర్కొన్నారు. సిరియాపై దాడులకు పాల్పడాలనే ట్రంప్‌ నిర్ణయంతో తాను ఏకీభవిస్తున్నానని అన్నారు. అందుకే, అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ దేశాలకు మద్దతుగా నిలవాలని నిర్ణయించుకున్నానని అన్నారు. సిరియాలో ప్రత్యేక ఆపరేషన్‌ గురించి బ్రిటన్‌ ప్రథాని థెరిస్సా మేతో తాను ఫోన్‌లో సంభాషించినట్లు వెల్లడించారు.